Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బాలీవుడ్‌కి తలనొప్పి..?
హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ ఆనంద్ తీసిన ఫైటర్ మూవీలో కథలో క్వాలిటీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా లేవు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మేకింగ్, కథనంలో దమ్ము కూడా లేదు. దీంతో ఆ డైరెక్టర్‌ని కామెంట్ చేయటానికి ఇప్పుడు అంతా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని వాడుకుంటున్నారు.
Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్‌కి భారీ స్పందనొస్తుంది. ఓ తెలుగు సినిమా.. అది కూడా బాలీవుడ్ మూవీ కంటే మంచి క్వాలిటీతో వస్తోందని, తక్కువ బడ్జెట్‌లో ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఏంటని అంతా మెచ్చుకుంటున్నారు. అయితే, ఈ సినిమా క్వాలిటీ నచ్చి, హిందీ మూవీ ఫైటర్‌ని చీల్చి చండాడేస్తున్నారు. హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ ఆనంద్ తీసిన ఫైటర్ మూవీలో కథలో క్వాలిటీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా లేవు.
SS RAJAMOULI: రాజమౌళి సినిమా.. కచేరీ మొదలైంది.. ముందే బీజీఎమ్స్..
ఇక సినిమా రిలీజ్ అయ్యాక మేకింగ్, కథనంలో దమ్ము కూడా లేదు. దీంతో ఆ డైరెక్టర్‌ని కామెంట్ చేయటానికి ఇప్పుడు అంతా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని వాడుకుంటున్నారు. అసలు సినిమా ఎలా తీయాలో, గ్రాఫిక్స్ క్వాలిటీ ఎలా ఉండాలో ఆపరేషన్ వాలెంటైన్ చూసి నేర్చుకోమంటున్నారు. మొన్న ఆదిపురుష్ డైరెక్టర్‌ని కూడా హనుమాన్ దర్శకుడిని చూసి సినిమా తీయటం నేర్చుకోమన్నారు. ఇలా సౌత్‌లో ఏదైనా మూవీ మంచి క్వాలీటీతో వస్తే, వెంటనే బాలీవుడ్ ఫ్లాప్ మూవీతో పోల్చి, సౌత్ సినిమాను పొగిడేయటం, హిందీ సినిమాను ట్రోల్ చేయటం కామనైంది.
ఇప్పుడు ఇదే ప్రమోషన్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్‌కి ప్లస్ అవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది.