Oppenheimer: థియేటర్స్‌లో పేలిన బాంబు.. అమెరికా బాంబుకి ఇక్కడ పరేషాన్.. !

ఓపెన్ హైమర్ పాత్రలో మర్ఫీ పాతుకుపోతే, మిగతావాళ్లు తోడయ్యారు. ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, అదిరిపోతే, మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలాన్ మూవీలంటేనే విజువల్ ట్రీట్ తోపాట మ్యూజికల్ ట్రీట్ కూడా ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 21, 2023 | 05:19 PMLast Updated on: Jul 21, 2023 | 5:19 PM

Oppenheimer Review Netizens Call Christopher Nolans Film A Masterpiece

Oppenheimer: సైంటిస్ట్ కమ్యూనిటీల్లో ఓపెన్ హైమర్ అంటే, ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి బాంబు రూపం ఇచ్చిన సైంటిస్ట్ అంటారు. ప్రపంచంలోనే మొదటి అణు బాంబుని సృష్టించిన ఆయన బయోపిక్ ఇంతవరకు ఎక్కడా రాకపోవటం వింతైతే, ఘనకీర్తితో పాటు చెడు కీర్తిని మోసిన ఏకైక సైంటిస్ట్‌గా కూడా ఓపెన్ హైమర్ పాపులర్. అలాంటి తన బయోపిక్‌తో క్రిస్టోఫర్ నోలాన్ రిస్క్ చేశాడు.

ఇక కథలోకి విషయానికొస్తే.. జర్మన్ మూలాలున్న అమెరికన్ సైంటిస్టు, నాజీల నాశనం కోసం అణుబాంబు తయారు చేయాలనుకోవటం.. అమెరికా గవర్నమెంట్ ప్లాన్ చేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌తో న్యూ క్లియర్ బాంబ్‌ని టెస్ట్ చేయటం, తర్వాత మానవాళి నాశనం కోసం మనిషే ఓ వెపన్ తయారు చేసి తప్పు చేశాడనే గిల్టీలో కి వెళ్లటం.. ఇదీ సింపుల్‌గా ఓపెన్ హైమర్ స్టోరీ. అమెరికన్ ప్రొమెథ్యూస్ బుక్ ఆధారంగా ఈ సినిమాను తీసిన క్రిస్టోఫర్ నోలాన్, తన సహజ పంథాకు దూరంగా వెళ్లి చేసిన రిస్క్ ఇది. ఓపెన్ హైమర్ పాత్రలో మర్ఫీ పాతుకుపోతే, మిగతావాళ్లు తోడయ్యారు. ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, అదిరిపోతే, మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలాన్ మూవీలంటేనే విజువల్ ట్రీట్ తోపాట మ్యూజికల్ ట్రీట్ కూడా ఉంటుంది. ఐతే క్రిస్టోఫర్ నోలాన్ మూవీలంటే స్క్రీన్ ప్లే మైండ్ బెండింగ్‌గా ఉంటుంది. అయితే, ఓపెన్ హైమర్ అలా తీయలేదు.

3 గంటలు ఎలా గడిచాయా అనేంత వేగంగా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఇక ఇందులో అణుబాంబు పేలే విజువల్స్‌ని గ్రాఫిక్స్‌లో కాకుండా సహాజంగా తీశారు. అణు విస్పోటనంలానే అనిపించేలా రియల్ బాంబులు పేల్చి వాటిని ఐమ్యాక్స్ కెమెరాలో బంధించి, ఆడియన్స్‌కి కొత్త ఎక్స్ పీరియన్స్ అందించాడు నోలాన్. మొత్తానికి అంచనాలకు అనుగునంగానే ఓపెన్ హైమర్ థియేటర్స్‌లో దుమ్ముదులుపోతోంది. కాకపోతే ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ ప్లేక్షకులు ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.