Oscar Awards: ఆస్కార్ అందుకున్న భారతీయుల చరిత్ర ఇదే..!
సాధారణంగా ఎవరైనా అద్భుతమైన ప్రతిభ కనపరిస్తే నీకు ఆస్కార్ గ్యారెంటీ అంటూ ఉంటారు. ఎందుకంటే దీనికి ప్రపంచ వ్యాప్తంగా అంత గుర్తింపు ఉంది కాబట్టి. ఈ అవార్డ్ సాధించారంటే ప్రపంచస్థాయిలో వీరు గొప్పవారిగా చెప్పుకోవాలి. అలా చెప్పుకునే వారిలో మన భారతీయులు కూడా చాలా మందే ఉన్నారు. వారిని ఇప్పడు చూసేద్దాం.
మన దేశానికి ఈ ఆస్కార్ అవార్డుల ప్రవాహం 1983 నుంచే ప్రారంభమైంది. తొట్టతొలి సారి ఆస్కార్ గ్రహీతగా మహారాష్ట్రకు చెందిన భానూ అథైయా ఎన్నికయ్యారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాతిపిత గాంధీ చిత్రానికి గానూ.. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ క్యాటగిరీలో ఈ అవార్డ్ ఆమెకు వరించింది.
దీని తరువాత భారత చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సత్యజిత్ రే ని ద్వాదశకళా ప్రపూర్ణ అని చెప్పాలి. ఎందుకంటే దర్శకునిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథారచయితగా, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చిత్రకారుడు, కళా దర్శకుడు, కథలు, నవలలు, వ్యాసాలు రాసిన సాహిత్య సరస్వతిగా తనదైన మార్క్ కళను కనబరిచినందుకు కలకత్తాకు చెందిన ఇతనికి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 1992లో ఆస్కార్ అవార్డుతో సత్కరించింది.
వీరిద్దరి తరువాత మళ్లీ మన దేశానికి 2009లోనే ఆస్కార్ లభించింది. అంటే 17 సంవత్సరాల తరువాతే మనదేశానికి ఈఘనత దక్కింది. లేటుగా అందుకున్నా లేటెస్ట్ గా అందుకున్నాం అనే నానుడి దీనికి సరిగ్గా అన్వయం అవుతుంది. ఎందుకంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు ఈ ఘనత సాధించడం గొప్ప విశేషంగా చెప్పాలి. అందులోనూ ఒకే చిత్రానికి రావడం చాలా అసాధారణమైన అంశం. ఆచిత్రం పేరు స్లమ్ డాగ్ మిలీనియర్.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కంపోజింగ్ ప్రతిభకుగానూ బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పోకుట్టి రిచర్డ్ ఫ్రైక్, ఇయాన్ ట్యాప్ తో కలిసి ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపును అందుకున్నారు. అలాగే మంచి గేయరచయితగా, కవిగా, స్క్రీన్ రైటర్, ఉత్తమ దర్శకుడు, నిర్మాతగా రాణించి ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ చేరువైన గుల్జార్ కి ఆస్కార్ వరించింది. జయహో పాటలోని బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో ఇతనిని ఎంపిక చేశారు.
ఆర్ రెహమాన్ ఈపేరు చెబితే అందరిలో మనసు పులకరిస్తుంది. ఆయన సంగీతం అలా ఉంటుంది. అందుకే ఇతనికి రెండు కేటగిరీల్లో అవార్డ్ కు ఎంపికయ్యారు. ఇలా రెండు విభాగాల్లో ఎంపికవ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. జయహో పాటకు గానూ బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇలా రెండు విభాగాల్లో కళా ప్రతిభను గుర్తించి రెహమాన్ కు ఆస్కార్ ప్రకటించింది.
ఆతరువాత 2019లో 95వ ఆస్కార్ అవార్డ్స్ కు ఢిల్లీకి చెందిన నిర్మాత గునీత్ మోర్గా ఎంపికయ్యారు. ఇతను నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ అనే డాక్యూమెంటరీ చిత్రం ఆస్కార్ ను కైవసం చేసుకుంది.
అంతేకాకుండా ఆస్కార్ రేసులో ఆల్ దట్ బ్రెత్స్ అలాగే ది ఎలిఫెంట్ విస్ఫరర్స్ అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ డ్యాక్యూమెంటరీ ఫీచర్ విభాగంలో ముందుండగా.. మన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దూసుకుపోతుంది. వీరు ఎలాగైనా ఘనవిజయం సాధించి తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ఎగురవేయాలని కోరుకుందాం.
T.V.SRIKAR