ఆస్కార్ కి మళ్లీ సూటి… 2027లో 4 ఆస్కార్స్ ఛాన్స్ ..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీని పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేసిన రాజమౌళికి, అన్నీ కలిసొస్తున్నాయా..? ఒక వైపు నెట్ ఫ్లిక్స్ అధినేతతో స్నేహం ఆమధ్య త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ తెచ్చిపెట్టిందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 11:54 AMLast Updated on: Apr 12, 2025 | 11:54 AM

Oscars Are Back On Track Chance Of 4 Oscars In 2027

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీని పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేసిన రాజమౌళికి, అన్నీ కలిసొస్తున్నాయా..? ఒక వైపు నెట్ ఫ్లిక్స్ అధినేతతో స్నేహం ఆమధ్య త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ తెచ్చిపెట్టిందన్నారు. మరో వైపు హాలీవుడ్ దిగ్గజాలైన జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్ బర్గ్ ఇద్దరికీ ఇద్దరూ రాజమౌళి కొత్త సినిమాకోసం ఇండియాలో ల్యాండ్ కాబోతున్నారు. ఇద్దరి ఓన్ బ్యానర్లు ఈ సినిమాను యూఎస్, యూరప్ లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి.ఇలా డజన్ కి పైనే అంశాల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకు వరల్డ్ వైడ్ గా బాగా కలిసొస్తోంది. ఇలాంటి టైంలో అకాడమీ అవార్డ్స్ రూల్స్ మారాయి. దెబ్బకి రాజమౌళి ఎకౌంట్ లోకి ఓ అవార్డు ముందే ఫిక్స్ అయిపోయింది. అదే బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫి… ఈ కేటగిరీని 2027 నుంచి ఆస్కార్ అవార్డుల రేసులో యాడ్ చేయబోతున్నారు. నిజానికి ఈ విషయం ఎనౌన్స్ చేస్తూ త్రిబుల్ ఆర్ విజువల్స్ ని వాడటం గర్వ కారణమన్నాడు రాజమౌళి. కాని అసలు విషయం అది కాదు… అంతకు మించి… అదే తనకి కొట్టిన పిండైన కేటగిరీని ఆస్కార్ లో చేర్చటం… అది కూడా 2027 నుంచి… అక్కడే రాజమౌళి ఎకౌంట్ లో మరో ఆస్కార్ కన్ఫామ్ అంటున్నారు..

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీని 2027 కి రిలీజ్ అయ్యేలా రాజమౌలి ప్లాన్ చేసిన వేళ, ఆస్కార్ అకాడమీ అవార్డుల రూల్స్ మారాయి.. అదే దర్శక ధీరుడు రాజమౌళికి పండగ తెస్తోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో ఒరిజినల్ సాంగ్ కి ఆస్కార్ ని సొంతం చేసుకున్నాడు కీరవాణి. కాకపోతే ఆ పాటకి ఆస్కార్ రావటం వెనక రాజమౌళి మేకింగ్, కొరియోగ్రాఫర్ కష్టం, ఎన్టీఆర్, చరణ్ అద్భుతమైన డాన్స్ కారణం.

కారణమేదైనా ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్న రాజమౌళికి, ముందే ఓ ఆస్కార్ బుక్ అయ్యేలా ఉంది. దానికి కారణం కూడా అకాడమీ అవార్డ్స్ జ్యూరీ తీసుకున్న నిర్ణయమే.. ఇంతవరకు స్టంట్ డిజైన్ ఆస్కార్ అనేది లేదు… ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రఫీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అకాడమీ అవార్డ్స్ జ్యూ నిర్ణయం తీసుకుంది

2027 నుంచి ఆ కేటగిరీలో అవార్డులు ఇవ్వటం మొదలు పెట్టనున్నట్టు తేల్చింది. ఎగ్జాక్ట్ గా అవార్డుల జర్నీ మొదలైన 100 ఏళ్లకు ఆ కేటగిరీకి మోక్షం లభించేలా ఉంది. అయితే ఇప్పుడు ఇదే నిర్ణయం రాజమౌలి పాన్ వరల్డ్ మూవీకి పండగ తెచ్చేలా ఉంది.

రెండు భాగాలుగా ప్లాన్ చేసి, చివరికి 4 గంటల నిడివితో ఒకే భాగంగా ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీ ని ప్లాన్చేశాడు రాజమౌలి.. ఈ సినిమా కు ఆస్కార్ అకాడమీ అవార్డుల తీసుకున్న కొత్తనిర్ణయం ఎందుకు పండగ తెచ్చేలాఉందంటే, రాజమౌళి బాహుబలి టైం నుంచే యాక్షన్ సీక్వెన్స్ తో ప్రపంచాన్ని ఆకట్టుుకుంటున్నాడు

త్రిబుల్ ఆర్ లో కూడా నాటు నాటు పాట ఎంత ఫేమసో, ఇంటర్వెల్ లో జంతువులతో ఫైట్ సీన్ అంత ఫేమస్… అందులో ఒక షాట్ నే వాడుకుని ఆస్కార్ అకాడమీ జ్యూరి ఇప్పుడు స్టంట్స్ కి కూడా ఆస్కార్ ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఇదే నిర్ణయం చాలా ఏళ్ల క్రితం తీసుకుంటే, బాహుబలి1 క్లైమాక్స్ వార్ కి, బాహుబలి 2 విలన్ తో లాస్ట్ ఫైట్ కి డెఫినెట్ గా ఆస్కార్ దక్కేది. త్రిబుల్ ఆర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కి కూడా ఆ అవార్డు వచ్చేది

అందుకే ఇలాంటి సీన్లకు రాజమౌళి ఎక్స్ పర్ట్ కాబట్టే, సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ 2027 లోనే రిలీజ్ కాబట్టి, పక్కగా అప్పుడు యాక్షన్ కొరియోగ్రఫి కేటగిరీలో ఆస్కార్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఫారిన్ మూవీ, లేదంటే ది బెస్ట్ ఫిల్మ్ తో పాటు, స్క్రీన్ ప్లే లో కూడా లాస్ట్ టైం నామినేషన్ మిస్ అయ్యింది. ఐతే అందులో కూడా రాజమౌళి కి అంతా అవార్డుని ఎక్స్ పెక్ట్ చేశారు… ఏదేమైనా, ఏ కెటగిరీకి ఎంత సీన్ ఉన్నా, యాక్షన్ కొరియోగ్రఫీలో హాలీవుడ్ తల దన్నే సీన్లు రాజమౌళి మూవీలో ఉండే ఛాన్స్ ఉంది… కాబట్టే 2027 లోనే ఆ కేటగిరీకి ఆస్కార్ మోక్షం అనగానే, అందరి చూపు రాజమౌళి వైపే పడింది.