OTT Web Series: భారత్ లోని టాప్ 10 వెబ్ సిరీస్ లు ఇవే.. చూడకుంటే చూసేయండి..
నేటి సినిమా ప్రపంచం మరింత సౌకర్యవంతంగా మారిపోయింది. సినిమా అంటే థియేటర్లకు వెళ్లి చూడాలనే పరిస్థితులు ఇప్పుడు లేవు. అంతగా వెళ్లాలనుకునే వారు రీవ్యూలు, రేటింగ్ లు చూసి బాగుందంటే మాత్రమే వెళ్తున్నారు. దీనికి గల కారణం ఓటీటీ మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోవడం. ఇందులో కామెడీ నుంచి క్రైమ్ వరకూ అన్ని జోనర్ల సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్లలో అయినా నెలకు ఒక సినిమా విడుదల అవుతుంది. అందున తన అభిమాన హీరో సినిమా అయితే ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే విడుదల అవుతాయి. అంటే రెండు సార్లు సినిమా థియేటర్లకు వెళ్లి వినోదాన్ని ఆస్వాధించడం కన్నా.. ఇలా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తూ సమయాన్ని వినోదభరితంగా మార్చుకుంటున్నారు. అలా ఈ ఓటీటీ ప్లాట్ ఫాం సినిమాల విడుదలకు సరికొత్త మార్గాన్ని సులభతరం చేసుకుంది.
ఇక కొందరైతే థియేటర్ల కంటే కూడా ఓటీటీ లో విడుదల చేసేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సినిమా హాల్లో విడుదల చేస్తే మొదటి షో అయిపోయేలోపు దాని గురించి రివ్యూ వచ్యేస్తుంది. దీంతో వెళ్లాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తారు. తద్వారా వారం ఆడాల్సిన బొమ్మ రెండో రోజుకే ఎత్తేయాల్సి వస్తుంది. అదే ఇలాంటి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికలైతే ఎప్పుడైనా చూడొచ్చు, ఎంతమందైనా చూడచ్చు, ఎన్నిసార్లైనా చూడచ్చు. ఇంతటి గొప్ప అవకాశాన్ని వినియోగదారుడు వినోదంలో ఎంపిక చేసుకుంటున్నాడు. అందుకే ఇందులో విడుదల చేసేందుకు ఎక్కువ ఆసక్తిచూపిస్తున్నారు.
పైగా ఇలా చేయడం వల్ల బడ్జెట్ కూడా తక్కువ. సినిమా రైట్స్ ఇంత మొత్తానికి అని అమ్మేస్తాడు నిర్మాత. ఇక సినిమా చూస్తారా లేదా అనేది స్ట్రీమింగ్ చేసుకునే వాళ్ల రిస్క్. నిర్మాతకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఇలాంటి స్ట్రీమింగ్ చేసే వారి కోణం నుంచి ఆలోచిస్తే సినిమా ఎలాగైనా ఉండనీ ఒకసారైతే తప్పకుండా చూస్తాడు. తద్వారా తమకు వ్యూస్ వస్తాయి. ఇలా లాభాన్ని పొందచ్చు. అదే విధంగా వినియోగదారుని ఆలోచనలో నుంచి చూస్తే తక్కువ ధరకే వినోదాన్ని అందిస్తారు. ఇంటిల్లిపాది కూర్చొని చూసేందుకు వీలుంటుంది. అది కూడా వారు ఫ్రీగా ఉన్న సమయంలో ఇలా రకరకాలుగా ఎవరి యాంగిల్ లో వారికి లాభాపేక్షగా మారింది ఈ ఓటీటీ వేదిక.
ప్రతి వారం ఏదో ఒక కొత్త కంటెంట్ తో విడుదలవుతూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇలా కోవిడ్ కారణంగా గత రెండు మూడేళ్ల నుంచి ఓటీటీలోనే సినిమాలు చూడటం ప్రారంభించారు ప్రేక్షకులు. ఇలా చేసే క్రమంలో సినిమాకు సంబంధించిన రివ్యూలు, ఫీడ్ బ్యాక్ ఇచ్చే ఐఎండిబి తాజాగా ఒక లిస్ట్ ను విడుదల చేసింది. ఓటీటీలో టాప్ 50 ర్యాంకుల్లో ప్రసారం అవుతున్న సినిమాల జాబితాను విడుదల చేసింది. అందులో ఈ క్రింది సినిమాలు టాప్ 10 ర్యాంకింగ్లో నిలిచాయి. మన టాలీవుడ్ హీరో వెంకటేష్, రాణా కలిసి నటించిన చిత్రం రానానాయుడు 47వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
View this post on Instagram
T.V.SRIKAR