సింహం “బాబాయ్”కి పద్మభూషణ్… మాస్ “అబ్బాయ్”కి పద్మ శ్రీ…
నటిసంహం బాలయ్యకి త్వరలోనే పద్మ భూషణ్ అవార్డు వచ్చేలా ఉందట. ఇండస్ట్రీలో ఫోర్ పిల్లర్స్ అనిపించుకున్న బాలయ్య, చిరు, నాగ్, వెంకీ లో ఈపాటికే మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ వచ్చింది. పద్మ విభూషణ్ కూడా మెగా స్టార్ ని వరించింది. సో తన తర్వాత టాలీవుడ్ లో పద్మ అవార్డు వరించేది బాలయ్యనే అంటున్నారు.
నటిసంహం బాలయ్యకి త్వరలోనే పద్మ భూషణ్ అవార్డు వచ్చేలా ఉందట. ఇండస్ట్రీలో ఫోర్ పిల్లర్స్ అనిపించుకున్న బాలయ్య, చిరు, నాగ్, వెంకీ లో ఈపాటికే మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ వచ్చింది. పద్మ విభూషణ్ కూడా మెగా స్టార్ ని వరించింది. సో తన తర్వాత టాలీవుడ్ లో పద్మ అవార్డు వరించేది బాలయ్యనే అంటున్నారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారంమే జరుగుతోంది. విచిత్రం గా ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు చేరేలా ఉంది. ఇదే నిజంగా జరిగితే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోల్లో పద్మ అవార్డుని అందుకున్న తొలి స్టార్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ చరిత్ర స్రుష్టించే ఛాన్స్ ఉంది.. మరి బాబాయ్, అబ్బాయ్ ఇలా ఇద్దరికీ పద్మా అవార్డుల పంట పండనుందా?ఇప్పుడే ఈ ప్రచారాలకు కారణం ఏంటి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి పద్మ శ్రీ రావటం ఆల్ మోస్ట్ కన్పామా? ఇదే వార్త ఎగ్జాక్ట్ గా నటసింహం బాలయ్యకి పద్యభూషణ్ వచ్చేలా ఉందనే ప్రచారం మొదలవ్వగానే తారక్ మీద వార్తలు పెరిగాయి. నిజానికి చిరు కంటే చిన్నవాడే అయినా టాలీవుడ్ నాలుగు స్థంబాల్లో సాలిడ్ పిల్లర్ గా మారాడు బాలయ్య . అంతగా ఎన్నో ప్రయోగాలతో సినీ పరిశ్రమలలో తెలుగుని వెలిగించాడు
అందుకే తనకి పద్మ భూషణ్ దక్కడం సరైందనే అనే వాదన ఎన్నో సార్లు వినిపించింది. ఐతే ఇదే తనకి ఆ సత్కారం దక్కాల్సిన సమయం అంటున్నారు. ఈ విషయం నందమూరి అభిమానులకు సంతోంషం కలిగించొచ్చు.. అయితే ఇలాంటి టైంలోనే యంగ్ టైగర్ అలియాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా పద్మా అవార్డుల లిస్ట్ లో కనిపించేలా ఉంది
త్రిబుల్ ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్లిన ఎన్టీఆర్, దేవరతో పాన్ ఇండియాని షేక్ చేశాడు. అందుకే పద్మశ్రీ దక్కుతుందా అంటే, కేజీయఫ్ తో యష్, బాహుబలి తర్వాత సలార్, కల్కీతో ప్రభాస్, పుష్ప తో బన్నీ, త్రిబుల్ ఆర్ లో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ కూడా పాన్ ఇండియాని షేక్ చేసినవాళ్లే.. కాకపోతే వాళ్లకి తారక్ కి మధ్య ఉన్న తేడా, తన కెరీర్ లో అతి చిన్న వయసులోనే తెలుగు సినిమాను వెలిగించటం
కెరీర్ లో మరీ టీనేజ్ లోనే ఆది నుంచి సింహాద్రి వరకు , అదే ఆది నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు చాలా ప్రయోగాలు చేశాడు. చేయని జోనర్ లేదు, చేయని ప్రయోగం లేదు, న్యాచురల్ ఆర్టిస్ట్ గా మాస్ లో ఇమేజ్ రావటం మాత్రం నిజంగా వింతే.. ఇలా ఎన్నో కారణాలకు తోడు, టీడీపీ కూడా తారక్ కి కొద్ది కొద్దిగా దగ్గరౌతోందంటున్నారు.
ఎన్టీఆర్ కూడా టీడీపీకి దగ్గరయ్యేందుకు ముందడుగు వేస్తున్నాడంటున్నారు. ఈ బంధాన్ని మరింత బలపరిచేందుకు పద్మ అవార్డుల నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు చేర్చేఅవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మళ్లీ టీడీపి కి తారక్ దగ్గరైతే, ఫ్యాన్స్ లో పూనకాలే…ఇదే కాదు, మొత్తం ఇండియాలోనే ఇంత చిన్న వయసులో , పద్మ అవార్డుని అందుకు తొలి హీరోగా చరిత్ర స్రుష్టించేలా ఉన్నాడు తారక్.