prabhas : పాక్ తో ప్రభాస్ యుద్ధం.. ప్రేమకోసమేనా

కల్కి జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ టెంపోను కంటిన్యూ చేసేలా అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 22, 2024 | 10:16 AMLast Updated on: Jul 22, 2024 | 10:16 AM

Pakistani Actress To Act In Pan India Star Hero Darling Prabhas Movie

కల్కి జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ టెంపోను కంటిన్యూ చేసేలా అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్నాడు. ఇప్పటి కే రాజా సాబ్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన డార్లింగ్… నెక్ట్స్ ఏ సెట్ లో అడుగుపెడతాడోనన్న క్యూరియాసిటి ఫ్యాన్స్ లో నెలకొంది. సలార్ 2 తో పాటు సందీప్ వంగా ప్రాజెక్టులు ఉండటంతో వాట్ నెక్ట్స్ అన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టులు కాకుండా మరో దర్శకుడితో జతకట్టబోతున్నాడన్న మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.

సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడని కొంతకాలంగా నెట్టింట ప్రచారం జోరుగా నడుస్తోంది. డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని తెలుస్తోంది. యుద్ధం బ్యా్క్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది. రెబల్ స్టార్ తో చేయనున్న ఈ క్యూట్ లవర్ స్టోరీ కి ఫౌజీ అన్నటైటిల్ కూడా ప్రచారం జరుగుతోంది. పైగా సైనికుడి గెటప్ లోప్రభాస్ కనిపించనున్నడంతో… హను హీరోయిన్ విషయంలో ఖతర్నాక్ ప్లాన్ వేసినట్లు ఓన్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఓ వైపు క్యాస్టింగ్ విషయాలతో పాటు మరోవైపు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. అయితే ప్రభాస్ కు జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు ఉండనున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ సోగకళ్ల వయ్యారి సజల్ అలీ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. మైత్రీమూవీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ తో పాటు పాకిస్థాని బ్యూటీ నటించబోతున్నట్లు టాక్ .పాక్ లో అత్యథిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ శ్రీదేవి నటించిన మామ్ లో మెరిసింది. ఈమూవీలో తన నటనతో ఫిదా చేసిన బ్యూటీ… ప్రభాస్ తో రొమాన్స్ చేస్తే అదిరిపోతోందని భావించిన మేకర్స్ అప్రోచ్ అయ్యారట. బ్యూటీకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలో అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ కోసం పక్క దేశాల నటులు రంగంలోకి దిగుతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.