PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్..! తీర్పు వాయిదా..
ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ జరిగిన అల్లర్లకు, పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.
PALLAVI PRASHANTH: బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. అల్లర్ల కేసులో అరెస్ట్ అయి, చంచల్ గూడ జైల్లో ఉన్న ఆయనకు బుధవారం నాడు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో ఏ3 పరారీలో ఉన్నాడనీ.. వీళ్ళకి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఇప్పటివరకు ఇదే కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?
బిగ్ బాస్ 7 విన్నర్‌ని ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్‌లో అభిమానులు అల్లర్లకు పాల్పడటంతోపాటు ఆర్టీసీ బస్సులు, పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. బుధవారం రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ జరిగిన అల్లర్లకు, పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి సంబంధం లేదనీ, అన్నపూర్ణ స్టుడియో ముందు మధ్యాహ్నం రెండింటి నుంచే జనం గుమికూడారని కోర్టుకు తెలిపారు.
ప్రశాంత్ బయటకు వచ్చింది రాత్రి పదిన్నర తర్వాత.. ఈలోగా పోలీసులు అక్కడి జనాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నించారు అడ్వకేట్. ఈ సంఘటనతో సంబంధం లేని పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారని కోర్టులో వాదించారు. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడికి బెయిల్ ఇవ్వాలని కోరారు. పోలీసుల తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. డీసీపీ స్థాయి అధికారి వచ్చి బతిమలాడినా అభిమానులు అక్కడి నుంచి కదల్లేదన్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు పోలీస్ వాహనాలు, ప్రైవేట్ వెహికిల్స్‌పై రాళ్ళతో దాడి చేశారన్నారు.
OTT CENSOR: ఓటీటీ వీక్షకులకు కేంద్రం షాక్.. ఇకపై ఆ వెర్షన్స్ ఉండవ్..
ఈ కేసులో ఏ3 పరారీలో ఉన్నాడనీ, వీళ్ళకి బెయిల్ ఇస్తే, సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని పీపీ వాదించారు. రెండు వర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ అల్లర్ల కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళల్లో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నారు.