PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.. వాళ్లు ఎవరంటే..
ప్రశాంత్ ర్యాలీలో అభిమానులు.. బస్సుల మీద దాడి చేయడం.. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావడం.. ఈ ఘటనలో ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయ్. పల్లవి ప్రశాంత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు తెలియని బుల్లితెర ఆడియెన్స్ లేరు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా నిలిచిన ప్రశాంత్.. ఆ తర్వాత అరెస్ట్‌తో మరింత వైరల్ అయ్యాడు. రైతుబిడ్డగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన రచ్చ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. రైతుబిడ్డపై కేసు పడేలా చేశాయ్.
Tamilisai Soundararajan: తెలంగాణకు కొత్త గవర్నర్.. లోక్‌సభకు తమిళిసై..?
ప్రశాంత్ ర్యాలీలో అభిమానులు.. బస్సుల మీద దాడి చేయడం.. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావడం.. ఈ ఘటనలో ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయ్. పల్లవి ప్రశాంత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ప్రస్తుతం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రశాంత్ బయటకు వచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో నిందితులు కూడా బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక కేసు విషయంలో పల్లవి ప్రశాంత్ ఘటనపై కొందరు ఆయనకు మద్దతు తెలపగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ప్రశాంత్ కేసులో ఇప్పటికే 16మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడకు చెందిన సుధాకర్, పవన్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఈ వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే వరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.