PALLAVI PRASHANTH: అందుకే అరెస్ట్ ! చేసిందంతా పల్లవి ప్రశాంతే !

బిగ్‌బాస్ ఫైనల్స్ డే నాడు జరిగిన ఘర్షణలపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్.. ఎంత చెప్పినా వినకుండా అతి చేయడం వల్లే అల్లర్లు జరిగాయంటున్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 03:42 PMLast Updated on: Dec 22, 2023 | 3:42 PM

Pallavi Prashanth Is The Main Reason For Riots At Biggboss Studio

PALLAVI PRASHANTH: బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో జరిగిన అల్లర్లకు అసలు కారకుడు.. విన్నర్ పల్లవి ప్రశాంతే అంటున్నారు పోలీసులు. చేసిందంతా అతనే అనీ.. అందుకే అరెస్ట్ చేశామని చెబుతున్నారు. తాము కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపినా.. పాపులారిటీ కోసం తిరిగి వచ్చి ఘర్షణలకు కారణమయ్యాడనేది పోలీసుల వాదన. మరోవైపు ప్రశాంత్‌ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు దాఖలైంది.

COVID 19: కరోనా నుంచి తప్పించుకోవాలంటే మరో బూస్టర్‌ డోస్‌ తప్పదా

నెటిజెన్స్‌లో కొందరు మాత్రం.. ఫేమ్ కోసం ప్రయత్నించి జైలు పాలయ్యాడని కామెంట్ చేస్తున్నారు. ఈ కేసులో బిగ్‌బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామంటున్నారు పోలీసులు. బిగ్‌బాస్ ఫైనల్స్ డే నాడు జరిగిన ఘర్షణలపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్.. ఎంత చెప్పినా వినకుండా అతి చేయడం వల్లే అల్లర్లు జరిగాయంటున్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ప్రశాంత్ అన్నపూర్ణ స్టుడియో నుంచి బయటకు వచ్చాక.. అక్కడి నుంచి వెళ్ళిపోమని దారి ఏర్పాటు చేసి పోలీసులు పంపించేశారట. కానీ వాళ్ళ మాట వినకుండా మళ్ళీ వెనక్కి వచ్చాడనీ.. దీంతో ఎక్కువ మంది గుమికూడి ఘర్షణలు జరగడానికి అతనే కారణమని పోలీసులు వాదిస్తున్నారు. చెప్పినా వినకుండా జనంలో పాపులారిటీ కోసమే మళ్ళీ వెనక్కి వచ్చిన పల్లవి ప్రశాంత్.. అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడని ఆరోపించారు. ఈ ఘర్షణల్లో RTCకి చెందిన 6 బస్సులు, పోలీస్ వాహనాలు దెబ్బతిన్నట్టు చెబుతున్నారు.

ఈ కేసులో బిగ్‌బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నించబోతున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఆయన తరపు న్యాయవాది. ఈ అక్రమ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందంటున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై నటుడు శివాజీ స్పందించాడు. అతడు చాలా మంచి కుర్రోడనీ.. చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని, చట్ట ప్రకారమే ప్రశాంత్ బయటకు వస్తాడని చెప్పాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్వనీ కూడా ప్రశాంత్ అమాయకుడనీ.. అతడిని రిలీజ్ చేయాలని కోరారు. అభిమానులు అత్యుత్సాహంతో చేసిన పొరపాటు అనీ.. ఇందులో ప్రశాంత్ తప్పేమీ లేదంటోంది అశ్వినీ శ్రీ. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు, హోస్ట్ నాగార్జున మీద కూడా కేసు పెట్టాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు.

RAHUL GANDHI: రాహుల్ ప్రధానిగా పనికిరాడా ? కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఇండియా కూటమి

కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న ఈ బిగ్‌బాస్ షోను బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయమూర్తిని అభ్యర్థించారు. పల్లవి ప్రశాంత్ ర్యాలీ కారణంగానే గొడవలు జరిగాయని పోలీసులు వాదిస్తున్నారు. అందుకే కార్లు నడిపిన డ్రైవర్లు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అభిమానులం అంటూ.. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ వీడియోలతో ఆ రోజు అల్లర్లలో పాల్గొన్న వాళ్ళని గుర్తించేపనిలో ఉన్నారు. విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కర్నీ అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.