పాన్ ఇండియా కింగ్” కేక్ కట్ చేస్తే…. 4000 కోట్లు…

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో దుమ్ముదులిపాడు. కల్కీతో 1195 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడు సినిమాలు చేస్తున్నాడు. అంతవరకు బానే ఉంది. కాని మరో రెండు వారాల తర్వాత తన బర్త్ డే రాబోతోంది. బేసిగ్గా సినీ స్టార్ బర్త్ డే అంటేనే ఆ హంగామా వేరు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2024 | 10:32 AMLast Updated on: Oct 07, 2024 | 10:32 AM

Pan India Hero Prabhas Target For 4000 Cores

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో దుమ్ముదులిపాడు. కల్కీతో 1195 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడు సినిమాలు చేస్తున్నాడు. అంతవరకు బానే ఉంది. కాని మరో రెండు వారాల తర్వాత తన బర్త్ డే రాబోతోంది. బేసిగ్గా సినీ స్టార్ బర్త్ డే అంటేనే ఆ హంగామా వేరు.. అలాంటిది పాన్ ఇండియా కింగ్ అయిన రెబల్ స్టార్ బర్త్ డే అంటే నెక్ట్స్ లెవలే… మరి ఫ్యాన్స్ పరిస్థితేంటి? ఇప్పుడప్పుడే రెబల్ స్టార్ సినిమాలేవీ రిలీజ్ అయ్యేలా లేవు. లాస్ట్ ఇయర్ సలార్ వచ్చింది. ఈ ఇయర్ కల్కీ దుమ్ముదులిపింది. ఏప్రిల్ లోనే రాజా సాబ్ అంటే, అప్పటి వరకు మరేది కూడా రెబల్ స్టార్ కాంపౌండ్ నుంచి బయటికి రాదు… సో బర్త్ డే గిఫ్ట్ పరిస్థితేంటి? రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ నుంచి ఏదైనా స్పెషల్ ట్రీట్ ఉండబోతోందా? మూడింట్లో ఒకటా, రెండా, లేదంటే మూడు సినిమా టీంలు ప్రోమోలతో మతిపోగొడతాయా అంటే… ఇక్కడ ఆన్సర్ మాత్ర మూడు కాదు నాలుగు..

అక్డోబర్ 23 రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే… రెబల్ ఫ్యాన్స్ కి ఇదే దసరా, ఇదే దీపావళి, ఇదేక్రిస్మస్, ఇదే రంజాన్… అందుకే అక్టోబర్ 23 వస్తోందంటే, పదిరోజుల ముందునుంచే రెబల్ ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ఈపాటికే సోసల్ మీడియాలో సందడి మొదలైంది. బాహుబలి, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కీ ఇలా ఏ మూవీ వచ్చినా, వస్తున్నా యూఎస్ నుంచి యూకే వరకు, అలానే నార్త్ నుంచి సౌత్ ఇండియా వరకు అంతటా ఫ్యాన్స్ చేసే హంగామానే వేరు…

అలాంటిది ప్రభాస్ బర్త్ డే వచ్చిందనే డెఫినెట్ గా తన సినిమాల తాలూకు ఏవో అప్ డేట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, మూడింట్లో ఒక్క సినిమా తాలూకు అప్ డేట్ వచ్చినా పండగే.. కాని ఈ సారి ఒకటి కాదు, రెండు కాదు, మూడింటికి మూడు ప్రోమోలు రెడీ అవుతున్నాయి. రెబల్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేందుకు ముగ్గురు దర్శక నిర్మాతల టీం రెడీ అవుతోంది

అక్టోబర్ 22 న రాజా సాబ్ మూవీ టీం నుంచి థీమ్ మ్యూజిక్ తో చిన్న లిరికల్ సాంగ్ వచ్చే అవకాశం వందకు వందశాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే రోజు రాజా సాబ్, ఫౌజీ, అలానే స్పిరిట్ అప్ డేట్స్ ఇవ్వకూడదని మారుతి, హను రాఘవపూడీ, సందీప్ రెడ్డి కలిసి నిర్ణయం తీసుకున్నారట. ఈ గురువారం ప్రభాస్ ని కలిసినప్పుడే ఈ విషయం చర్చకు రావటం వల్లే, ఈ బర్త్ డే కి రెబల్ ప్యాన్స్ కి బ్రహ్మాండం బద్దలయ్యే సర్ ప్రైజులు రెడీ అని తెలుస్తోంది

రాజా సాబ్ నుంచి టీజర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాని ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే సినిమా కోసం ఇప్పుటి నుంచే డైలాగ్ కంటెంట్ రివీల్ చేయటం కరెక్ట్ కాదని, తీమ్ సాంగ్ లిరిక్స్ తో ప్రోమోని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఇది దసరాకే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది

ఇక ప్రభాస్ లేని సీన్ లతో ఫౌజీ షూటింగ్ జరిగింది కాబట్టి, ప్రభాస్ తాలూకు కంటెంట్ ఏది రివీల్ చేయటం కష్టం అనే అభిప్రాయం ఉంది. కాని ఫౌజీ కోసం చేసిన ఫోటో షూట్ విజువల్స్ తో ప్రోమో కట్ చేస్తున్నారట. ఓసారి ఆవీడియోని ప్రభాస్ కి చూపించి ఈ టీం కూడా ఈ ప్రోమో రిలీజ్ డేట్ ని దసరాకే ఎనౌన్స్ చేస్తుందట. మరి స్పిరిట్ పరిస్థితేంటంటే, ప్రభాస్ తాలూకు ఇమేజెస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో, చిన్న వీడియో మారిస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ జరిగింది.

సందీప్ రెడ్డి వంగా ఓ శాంపిల్ వీడియో రెడీ చేస్తున్నాడు. ఫైనల్ ఔట్ బాగుంటే, ప్రభాస్ నుంచి అప్రూవల్ వస్తే, తను కూడా స్పిరిట్ మూవీ ఎనౌన్స్ మెంట్ ని ఇలా ఏఐ సాయంతో ప్రోమో రూపంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రాజా సాబ్ సాంగ్ ప్రభాస్ బర్త్ డే కి ఒకరోజు ముందు వస్తే, స్పిరిట్, ఫౌజీ వీడియోలు మాత్రం ప్రభాస్ బర్త్ డే రోజే వస్తాయని తెలుస్తోంది.

ఇది కాకుండా నాలుగో సర్ ప్రైజ్ ఉంది. అదే సలార్ 2 టీం ఇవ్వబోతున్న ట్విస్ట్.. సలార్ 1 తీస్తున్నప్పుడే సలార్ 2 కోసం 10 శాతం షూటింగ్ చేసినటీం, ఆ కంటెంట్ లో ఓ ఫైట్ సీన్ ప్రోమోని ప్రభాస్ బర్త్ డే రోజు రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువున్నాయి. ఆపనిలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు తెలుస్తోంది.