PAN INDIA MOVIES: ఆలస్యమే అమృతమంటున్న పాన్ ఇండియా హీరోలు
యశ్ ఇప్పటి వరకు కేజీయప్ 2తో వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలంటే, నెక్స్ట్ పాన్ ఇండియా మూవీతో దండెత్తాలి. కాని ఇప్పటిదాకా సాగతీసుకుంటూ వచ్చాడు. ఇప్పడు ఈనెలలో టైటిల్ పోస్టర్‌తో సైలెన్స్‌కి బ్రేక్ వేస్తున్నాడు.
PAN INDIA MOVIES: ఎగ్జామ్స్ వస్తే ఎవరికైనా ఫీవర్ రావాల్సిందే. అలాంటి ఫీవర్ పాన్ ఇండియా మూవీ చేసేప్పుడు స్టార్ హీరోలకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే అలాంటి అగ్ని పరీక్షలనే బన్నీ, ఎన్టీఆర్, కన్నడ స్టార్ యశ్ సక్సెస్ ఫుల్‌గా తప్పించుకున్నారు. తప్పించుకుంటున్నారు. యశ్ ఇప్పటి వరకు కేజీయప్ 2తో వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలంటే, నెక్స్ట్ పాన్ ఇండియా మూవీతో దండెత్తాలి. కాని ఇప్పటిదాకా సాగతీసుకుంటూ వచ్చాడు. ఇప్పడు ఈనెలలో టైటిల్ పోస్టర్‌తో సైలెన్స్‌కి బ్రేక్ వేస్తున్నాడు.
SALAAR: డార్లింగ్ ఎక్కువగా కనిపించడా.. సలార్‌లో ప్రభాస్ రోల్ తగ్గించారా..?
నిజానికి ప్రభాస్ బాహుబలి 2 తర్వాత వెంటనే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంటూ వరుసగా పాన్ ఇండియా పరీక్షలు రాసి ఫెలయ్యాడు. చరణ్ కూడా త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య పంచ్‌తో అగ్నిపరీక్షలో దెబ్బలు తిన్నాడు. తారక్, బన్నీమాత్రం అగ్నిపరీక్షను వాయిదా వేస్తూ తెలివిగా టైం తీసుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్‌కి ఎలాంటి పరిస్తితి వచ్చిందో ఆచార్యతో చూసిన తారక్, కొరటాల శివతో ముందనుకున్న కథని మార్పించాడు. అలా రెండు కథలు మారాక దేవర మూవీని ఆచితూచి అడుగులేస్తు పూర్తి చేయిస్తున్నాడు.
పుష్ప 2 విషయంలో కూడా బన్నీ స్లో అండ్ స్టడీ అంటూ అగ్నిపరీక్షను ఎదుర్కొనేందుకు టైం తీసుకుంటున్నాడు. యశ్ కూడా అలానే చేసి ఇప్పడు కొత్త ప్రాజెక్ట్ ఎనైన్స్‌మెంట్‌తో బానే టైం తీసుకున్నాడు. కొన్ని సార్లు వేగంగా అగ్ని పరీక్షలు ఎదుర్కోవటంకన్నా.. వాటిని వాయిదా వేసి, టైం తీసుకుని, తీరిగ్గా ఎటాక్ చేయటమే బెటర్ అంటున్నారు. అదే ఫాలో అవుతున్నారు ఈ ముగ్గురు.