పాన్ ఇండియా కింగ్.. 6000 కోట్లని హోల్డ్ లో పెట్టాడు..
రెబల్ స్టార్ ప్రభాస్ డిసెంబర్ లో ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేస్తా అన్నాడు. ఇటలీలో సాంగ్స్ షూటింగ్స్ ప్లాన్ చేయగానే, తను మోకాలి నొప్పి వల్ల, రిలాక్స్ అయ్యాడన్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ డిసెంబర్ లో ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేస్తా అన్నాడు. ఇటలీలో సాంగ్స్ షూటింగ్స్ ప్లాన్ చేయగానే, తను మోకాలి నొప్పి వల్ల, రిలాక్స్ అయ్యాడన్నారు. కట్ చేస్తే తను ఇటలీలో దర్శనమిస్తున్నాడు. చెప్పాపెట్టకుండా ఇటలీకి తను వెళ్లటంతో రూమర్లకు బ్రేక్ వేసేందుకు ది రాజా సాబ్ టీం, అక్కడ సైలెంట్ గా సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేస్తోందా అన్న అనుమానాలు పెరిగాయి. మరి ఫౌజీ కొత్త షెడ్యూల్ షూటింగ్ పరిస్తితేంటనే లోపు, ఎలాగైనా జులై 1 కి స్పిరిట్ మొదలవ్వాలని ప్రభాస్ ఇలా స్పీడ్ పెంచాడా? అన్న డౌట్లు పెరిగాయి. కట్ చేస్తే రెబల్ స్టార్ దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నాడు. ఇది దర్శక నిర్మాతల ఊహకు కూడా అందలేదు… ఫ్యాన్స్ కూడా స్టన్ అయ్యే రెబల్ స్టార్ నిర్ణయం ఏంటో చూసేయండి..
రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ ని ఇటలీలో పూర్తి చేయబోతున్నాడా? అందుకే ఇటలీ చేరుకున్నాడా? ది రాజా సాబ్ ఆగిపోయిందన్న రూమర్లకు ఫిల్మ్ టీం ఇలా అగ్రెసీవ్ షూటింగ్ తో ఫుల్ స్టాప్ పెట్టబోతోందా? ఇవి సడన్ గా ప్రభాస్ ఇటలీకి వెళ్లగానే ఇండస్ట్రీలో పెరిగిన డౌట్లు, సోషల్ మీడియాలో చాలా మంది వేస్తున్న ప్రశ్నలు.95 శాతం పూర్తైన ది రాజా సాబ్ షూటింగ్ కేవలం 5 పర్సెంటే బ్యాలెన్స్. ఇటలీలో 4 సాంగ్స్ షూటింగ్ చేస్తే ఇక సినిమా పూర్తైనట్టే. హను రాఘవపూడీ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ కూడా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 1 న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ మొదలు కాబోతోంది. దసరాకు యానిమల్ పార్క్ ని లాంచ్ చేయాలనుకుంటున్న సందీప్, ఎట్టి పరిస్థితుల్లో జులై 1 కి స్పిరిట్ ని షురూ చేస్తాడట.
ఇంత జరుగుతుంటే, సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇటలీలో రిలాక్స్ అవుతున్నాడు. సమ్మర్ వెకేషన్ మొత్తం ఇటలీకే అంకితమంటున్నాడు. తన మోకాలి నొప్పి మళ్లీ తిరగతోడటంతో, డాక్టర్లు రిలాక్స్ అవ్వాల్సిందే అన్నారట. దీంతో చేసేది లేక ఇటలీలో సమ్మర్ వెకేషన్ తో రిలాక్స్ అయ్యే పనిలో ఉన్నాడు.ఇది తెలియక ఇటలీలో ది రాజా సాబ్ పెండింగ్ సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేశారనుకున్నారు. అలాని అవేవి ఆగిపోలేదు. జూన్ లో ది రాజా సాబ్ పెండింగ్ సాంగ్స్ పూర్తి చేసి, జూన్ లో ఫౌజీ కోసం 25 రోజులు కేటాయిస్తాడట. ఎట్టిపరిస్థితుల్లో జులై 1కి స్పిరిట్ ని లాంచ్ చేసి, ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేస్తారని తెలుస్తోంది.
అసలే ది రాజా సాబ్ అటకెక్కిందనే నెగెటీవ్ ప్రచారం జరుగుతుంటే, ఇప్పడు ఇటలీలో ప్రభాస్ రిలాక్స్ అయితే, రూమర్లే నిజమయ్యే ఛాన్స్ఉందనే మాటలు పెరిగాయి. వాటికి కౌంటర్ గా మే డే సాలిడ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది ది రాజా సాబ్ టీం. అలా మే ఫస్ట్ నుంచి ప్రమోషన్ ని షురూ చేయబోతోంది. సో అన్నీంటికి సాలిడ్ ప్లానింగ్ తోనే ముందడుగు వేస్తున్నాడు ప్రభాస్. అలా ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ అన్నీ 2 వేల కోట్లు రాబట్టే ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్నాయి కాబట్టే, రెబల్ స్టార్ నిర్ణయంతో 6 వేల కోట్ల బిజినెస్ హోల్డ్ లో పడింది కాని, రిస్క్ లో పడలేదని తేలుతోంది.