Pan India: పుష్ప నిర్మాతను చప్పరించేస్తున్న హీరో, డైరెక్టర్‌.. డబ్బులెవరికీ ఊరికే రావు బన్నీ.. గుర్తుపెట్టుకో !

పుష్ప 2 కోసం దేశం అంతా ఎదురుచూస్తోందిప్పుడు ! టీజర్‌ కాకుండా..ట్రైలర్‌ కాకుండా.. వేర్ ఈజ్‌ పుష్ప అంటూ 3 నిమిషాల గ్లింప్స్ వదిలిన టీమ్.. సినిమా మీద అంచనాలు పెంచేసింది. పుష్ప ఫస్ట్ పార్ట్‌కి భారీగా లాభాలు రావడంతో.. సెకండ్ పార్ట్ బడ్జెట్ అమాంతం పెంచేశారు మేకర్స్ ! బన్నీకే వంద కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. దీంతో పుష్ప ది రూల్ బడ్జెట్‌ 5వందల కోట్లకు చేరొచ్చు.. అంతకుమించి పెరగొచ్చు అనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 03:00 PMLast Updated on: Apr 13, 2023 | 3:00 PM

Pan India Movie Pushpa 2 Updates

నిజానికి పుష్ప అనేది రెండు పార్ట్‌లుగా ప్లాన్ చేయలేదు. సినిమా ప్లాన్ చేశాక అది రెండు పార్ట్‌లు అయింది. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ వచ్చింది. పుష్ప మొదటి పార్ట్ సెట్ చేసిన టార్గెట్‌ రీచ్ అవడం కాదు.. అంతకుమించి కొత్త రికార్డు క్రియేట్ చేయడమే ఇప్పుజు ముందున్న టార్గెట్. ఈ ప్రాసెస్‌లో డైరెక్టర్‌లో కన్ఫ్యూజన్‌ మొదలైనట్లు కనిపిస్తోందని తెలుస్తోంది. దీంతో టైమ్‌, మనీ వృథా అయిపోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయ్.

పుష్ప ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన బజ్‌ను అందుకునే ప్రాసెస్‌లో సెకండ్‌ పార్ట్‌ ఖర్చు లిమిట్స్ దాటుతుందని.. దానికి హీరో, డైరెక్టర్‌ కారణం అవుతున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయ్ టాలీవుడ్‌లో ! సినిమా ఖర్చు విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలను హీరో బన్నీ, డైరెక్టర్ సుకుమార్ చప్పరించేస్తున్నారట ! డబ్బు విపరీతంగా వృథా చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. పుష్ప 2 మేకింగ్‌లో దాదాపు 7 కోట్ల విలువైన రష్ వృథాగా పోయిందట. షూట్ చేయడం.. ఆ తర్వాత నచ్చకపోవడం.. దీంతో ఖర్చు వృథాగా మారడం.. ఇదే రిపీట్ అవుతోంది సెట్‌లో అనే టాక్ వినిపిస్తోంది.

షూట్ చేసిన రష్ మీద అల్లు అర్జున్ అసంతృప్తి వయ్క్తం చేశారని.. దీంతో దాన్ని పక్కనపెట్టారని తెలుస్తోంది. ఇలా పక్కనపెట్టిన షూటింగ్ రష్ విలువ.. అక్షరాల 7కోట్ల రూపాయలు. మాములుగా సుకుమార్ బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో షూటింగ్‌ చేస్తే ఆ రేంజ్‌ ఏంటో రంగస్థలం, పుష్ప పార్ట్‌ వన్ చూపించింది. ఐతే పుష్ప 2కు అలాంటి అవకాశం లేకుండా పోతోంది. షూటింగ్‌లో సుకుమార్‌ రకరకాల ప్రయోగాలతో సమయం, డబ్బు వృథా చేస్తున్నారని యూనిట్ అంతా మాట్లాడుకుంటోంది.

అప్పటికప్పుడు ఏదో స్క్రిప్ట్ రాసుకోవడం.. అది హీరోగారికి నచ్చకోవడం.. దీంతో దాన్ని పక్కనపెట్టడం.. 7కోట్లవిషయంలో జరిగింది అదే ! ఓడిపోతే బాధ పెరుగుతుంది.. గెలిస్తే బాధ్యత పెరుగుతుంది.. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి.. మరో గెలుపునకు దారు చూపించినవాడే నిజమైన విజేత. ఇలా విజేత అయ్యే ప్రాసెస్‌లో సుక్కు టెన్షన్ పడిపోతున్నాడా.. అందుకే డబ్బు, సమయం ఇంతలా వృథా అయిపోతుందా.. బన్నీ తీరు కూడా దీనికి కారణమా అనే డిస్కషన్ ఇప్పుడు అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.