Kalki – allu arjun : ప్రభాస్‌ను అల్లు అర్జున్‌ అంత మాట అనేసాడా..

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ.. భారీ అంచనాల మధ్య ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ .. బాక్సీఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 4, 2024 | 11:35 AMLast Updated on: Jul 04, 2024 | 11:35 AM

Pan India Rebel Star Prabhas Nag Ashwins Sci Fi Movie Kalki 2898 Ad

 

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ.. భారీ అంచనాల మధ్య ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ .. బాక్సీఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోస్తోంది.. వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ రికార్డుల సునామీ సృష్టిస్తోంది.. కల్కి మానియాలో పడి హాలీవుడ్‌ సినిమాలు సైతం కొట్టుకుపోతున్నాయంటూ.. కల్కి సునామీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. దీంతో..ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిస్తున్నారు.. ఇలాంటి టైమ్‌లో కల్కిపై స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

కల్కి 2898 ఏడీ టీమ్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.. ఇది ఓ విజువల్ వండల్ అంటూ కొనియాడాడు.. సూపర్ హీరో పాత్రలో మిత్రుడు ప్రభాస్ అదరగొట్టేశాడు ప్రశంసించాడు.. అమితాబ్ జీ.. మీరు నిజంగా మా అందరికీ ఇన్‌స్పిరేషన్. మీ గురించి చెప్పడానికి మాటల్లేవ్ అంతే అన్నాడు.. కమల్ హాసన్ సార్.. మిమ్మల్ని నెక్స్ట్ పార్ట్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. డియర్ దీపిక.. నీ పెర్ఫామెన్స్ స్టన్నింగ్. డియర్ దిశా పటానీ స్క్రీన్‌పై అట్రాక్ట్ చేశావ్.. అంటూ ఈ సినిమాలో కనిపించిన ప్రతి నటీనటులపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు అల్లు అర్జున్.. అంతేకాదు.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేందుకు ఇంత రిస్క్ తీసుకున్న వైజయంతీ ఫిలిమ్స్ అధినేత అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్‌లకి సెల్యూట్. చివరిగా ప్రేక్షకులతో వావ్ అనిపించిన కెప్టెన్ నాగ్ అశ్విన్‌.. నిజంగా ఈ జనరేషన్‌కి ఓ పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ అని పేర్కొంటూ బన్నీ చేసిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో.. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపేస్తోంది. దీంతో.. ఒక్క ట్వీట్ తో ఈ దుమారం ఏంటి స్వామీ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

ఇక.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప-1 సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో.. పుష్ప-2 కోసం వరల్డ్ వైడ్‌గా బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.