PUSHPA: పుష్ప, ఆర్ఆర్ఆర్, బాహుబలి రేంజ్ పాటలు రావట్లేదా?
నాటు నాటు పాటకు అమెరికన్స్ నుంచి యురోపియన్స్ వరకు అంతా చిందేశారు. బాహబలి పాటలు ఇలానే సౌత్, నార్త్‌లో ఐదు భాషల్లో పేలాయి. కానీ, కొంతకాలంగా ఎటొచ్చి ఇలాంటి పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసే పాటలే ఇప్పుడు కరువయ్యాయి.
PUSHPA: పాన్ ఇండియా పాట అంటే శ్రీవల్లి రేంజ్‌లో ఉండాలి. ఆ పాటని క్రికెటర్లు నుంచి కామన్ ఆడియన్స్ వరకు భారతీయ భాష్లలో అంతా పాడుకున్నారు. భుజం స్టెప్ వేశారు. తర్వాత నాటు నాటు పాటకు అమెరికన్స్ నుంచి యురోపియన్స్ వరకు అంతా చిందేశారు. బాహబలి పాటలు ఇలానే సౌత్, నార్త్‌లో ఐదు భాషల్లో పేలాయి. కానీ, కొంతకాలంగా ఎటొచ్చి ఇలాంటి పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసే పాటలే ఇప్పుడు కరువయ్యాయి.
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు.. షరతులివే..
హిందీ మూవీ జవాన్‌లో వేల మందితో షారుక్ డాన్స్ చేసే సాంగ్ కొద్దివరకు బాగానే సౌత్ వరకు ఫోకస్ అయ్యింది. కానీ, మరీ అంత వైరల్ కాలేదు. ఇక రజినీకాంత్ జైలర్ మూవీ విషయానికొస్తే అందులో హుకుం పాట సౌత్‌లోనే బాగా వైరలైంది. హిందీలో అంతగా సందడి చేయలేదు. ఇక పటాన్, జవాన్ లాంటి పాన్ ఇండియా మూవీల్లోని పాటలు అంతగా పేలలేదు. ఏపాట హిట్టైనా ఏదో ఒక భాష వరకే సందడి చేసింది. తమిళ్ మూవీ బీస్ట్.. హిట్ కాకున్న అరబిక్ కుత్తు సౌత్, నార్త్ అంతటా వైరలైంది. అలాంటి సందడి మల్లీ తమిళ్ మూవీల్లో కనిపించలేదు. కేజీయఫ్ రాకీ భాయ్ రేంజ్‌లో కేజీయఫ్ 2 సాంగ్స్ కూడా ఆకట్టుకోలేదు.
ఓరకంగా చెప్పాలంటే పుష్ప, త్రిబుల్ ఆర్, బాహుబలి పాటల రేంజ్‌లో మరే పాటలు.. తూటాల్లా దూసుకెళ్లట్లేదు. యానిమల్‌లో అర్జన్ వ్యాలీ కొంతవరకు సౌత్‌లో కూడా వైరలైంది. కాని, మరీ శ్రీవల్లీ, ఊ అంటావా, నాటు నాటు పాటలా సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోతున్నాయి ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా మూవీ పాటలు.