Prsbhas : ఆ వార్తల్లో నిజం లేదట..!
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్, యానిమల్ (Animal) దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటింగ్ మూవీ స్పిరిట్.. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ స్కై హైగా పెరిగిపోయింది.

Pan India star Prabhas and animal director Sandeep Reddy Vanga combo is the most awaited movie spirit..
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్, యానిమల్ (Animal) దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటింగ్ మూవీ స్పిరిట్.. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ స్కై హైగా పెరిగిపోయింది. యంగ్ రెబల్ స్టార్ కటౌట్‌కు తగ్గ స్టోరీ పడితే ఎలా ఉంటుందో సలార్ మరోసారి ప్రూవ్ చేసింది. ఇక.. యానిమల్ మూవీతో మరోసారి టేకింగ్ పవర్ ఏమిటో తెలిసేలా చేశాడు సందీప్ వంగా.. దీంతో.. వీరిద్దరి కాంబోలో మూవీ అన్న టాకే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఇక ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.. ఈ టైమ్‌లో స్పిరిట్ విషయంలో పలు అప్‌డేట్స్ వినిపిస్తుండగా.. రీసెంట్‌గా ఓ రూమర్ బయటకు వచ్చింది.
ముఖ్యంగా ప్రభాస్-సందీప్ వంగా (Prabhas – Sandeep) మూవీలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈ మూవీలో నటి త్రిష నటించబోతుందన్న వార్తలు వినిపించాయి.. చాలా కాలం తర్వాత ప్రభాస్-త్రిష జంటగా కనువిందు చేయనున్నారన్న వార్తలు ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాయి. అయితే.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఒక వార్త వినిపిస్తోంది.. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని.. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ డిటైల్స్ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో.. మరోసారి ప్రభాస్-త్రిష జోడీని తెర మీద చూడాలనుకున్న ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు..
ఇక ఈ మూవీ స్టోరీ లైన్‌పై ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ మూవీ వార్ & హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలకు రీసెంట్‌గా చెక్ పెట్టాడు సందీప్‌రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ హారర్ లేదా వార్ స్టోరీ కాదని.. ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథ అని చెప్పి ఫ్యాన్స్ ఉత్కంఠకు తెర దించేశాడు. దీంతో.. పవర్‌ఫుల్ పోలీస్ గెటప్‌లో ప్రభాస్ కటౌట్ అదిరిపోవడం ఖాయమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇక.. ప్రభాస్ ఈ ఏడాదిలో మే లో తన గ్రాండ్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” తో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.