Prabhas NTR : ప్రభాస్, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్…
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్(Star Prabhas), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Pan India star Prabhas, man of masses NTR going to share the screen?
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్(Star Prabhas), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపించే బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
‘సలార్’ (Salar) విడుదలకు ముందు.. ఇది ప్రశాంత్ నీల్ (Prashant Neel) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానున్న సినిమా అని.. ఇందులో ‘కేజీఎఫ్’ (KGF) హీరో యష్ తో పాటు, ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ హీరో ఎన్టీఆర్ కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తీరా ‘సలార్’ విడుదలయ్యాక చూస్తే.. అలాంటిదేమీ లేదు. అయితే ఇప్పుడు ‘సలార్-2’ మొదలు కాబోతున్న సమయంలో ఊహించని సర్ ప్రైజ్ వచ్చింది.
‘సలార్’ లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. మన్నార్ అనే పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ నెటిజెన్ “శివమన్నార్ పాత్ర ఎంతో నచ్చింది. ఆ పాత్రను ఇంకా చూడాలనుకుంటున్నాం” అంటూ ట్వీట్ చేయగా.. దానికి పృథ్వీరాజ్ ఊహించని రిప్లై ఇచ్చాడు. “ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన కథలన్నింటిలో శివమన్నార్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ పాత్రకి మరొక యూనివర్స్ తో ఊహించని క్రాస్ ఓవర్ ఉంటుంది.” అని పృథ్వీరాజ్ తెలిపాడు.
పృథ్వీరాజ్ ఇచ్చిన రిప్లైతో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అవుతోంది. ‘కేజీఎఫ్’ లో నటించిన కొందరు నటీనటులు.. ‘సలార్’ లో వేరే పాత్రలు పోషించారు కాబట్టి.. ఆ రెండు యూనివర్స్ ల క్రాస్ ఓవర్ కి ఆస్కారం లేదు. ఈ లెక్కన ‘సలార్’, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ల క్రాస్ ఓవర్ కి అవకాశముంది. అదే జరిగితే.. ప్రభాస్, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉంది.