Kalki song : ‘కల్కి’ జర్నీలో ఎన్ని పాటలంటే..
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి (Kalki) సినిమా థియేటర్లోకి రావడానికి రెండు వారాల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. దేశమంతా బుజ్జితో చుట్టేస్తున్నారు.

Pan India starrer Prabhas starrer Kalki is less than two weeks away from hitting the theatres.
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి (Kalki) సినిమా థియేటర్లోకి రావడానికి రెండు వారాల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. దేశమంతా బుజ్జితో చుట్టేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహకందని విధంగా ఉంది. హాలీవుడ్ సినిమాను తలిపించేలా ట్రైలర్ కట్ చేశాడు నాగ్ అశ్విన్. ఈ ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యూనానిమస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. అంచనాలను మరింత పెంచేందుకు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా LED స్క్రీన్స్‌తో స్పెషల్ కాన్వాయ్‌లు ఏర్పాటు చేశారు.
దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభం అవుతుందని.. మేకర్స్ తెలిపారు. అలాగే.. అమరావతిలో జూన్ 23న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా కల్కి ఫస్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
‘మ్యూజికల్ జర్నీలో (Musical Journey) భాగంగా ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అయ్యే టైమ్ దగ్గర పడింది’ అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ కల్కి ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కిలో మొత్తం రెండు పాటలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి టా టక్కర సాంగ్ కాగా, లేటెస్ట్‌గా పంజాబ్ స్టైల్ టైటిల్ సాంగ్ యాడ్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌లో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సంతోష్. మరి కల్కి సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.