Ram Charan: వీళ్లకు 99 శాతం ఓకే.. కాని ఆ ఒక్క శాతం భయపెడుతోంది!
99 శాతం పుష్ప-2 హిట్ అవటం ఖాయం. కాని ఆ ఒక్క పర్సెంటే ఫిల్మ్ టీం కి కంగారు పెట్టించేలా ఉంది. ఎందుకంటే గతంలో రక్త చరిత్ర హిట్టై రక్తచరిత్ర 2 ఫ్లాపైంది. ఇప్పుడు అలాంటి చాన్స్ ఉందా అంటే, చెప్పలేం. పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్‌ని పార్ట్ 2 కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ.
Ram Charan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప-2 రిలీజ్‌కి ముందే హిట్ అనుకోవాలి. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి బాహుబలి-2, కేజీయఫ్-2 మూవీల‌్లాగా ఇది కూడా వసూళ్ల వరద పారించడం కామన్. అలా చూస్తే 99 శాతం పుష్ప-2 హిట్ అవటం ఖాయం. కాని ఆ ఒక్క పర్సెంటే ఫిల్మ్ టీం కి కంగారు పెట్టించేలా ఉంది. ఎందుకంటే గతంలో రక్త చరిత్ర హిట్టై రక్తచరిత్ర 2 ఫ్లాపైంది.
ఇప్పుడు అలాంటి చాన్స్ ఉందా అంటే, చెప్పలేం. పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్‌ని పార్ట్ 2 కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ. అలా కాకపోతే ఇది బన్నీకి ఊహించని, కోలుకోలేని దెబ్బ. ఇలాంటి వన్ పర్సెంటేజ్ భయాలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌కి కూడా ఉన్నాయి. యంగ్ టైగర్‌తో కొరటాల శివ తీస్తున్న దేవర మూవీ దుమ్ముదులుపుతుందనే అంచనాలున్నాయి. అలా కాకపోతే, త్రిబుల్ ఆర్‌తో తనకి వచ్చిన ఇమేజ్, మార్కెట్ స్థిరపడవు. అందుకే దేవర మూవీ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా వన్ పర్సెంటేజ్ భయాలు కూడా ఉన్నాయనంటున్నారు.
రామ్ చరణ్‌కి త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య రూపంలో పంచ్ పడింది. కాబట్టి శంకర్‌తో చేస్తున్న గేమ్ ఛేంజర్ మీద అంచనాల భారం ఉండకపోవచ్చు. ఐతే ఆచార్య పంచ్ తర్వాత కొరటాల శివ తీస్తున్న సినిమా అవటం వల్ల దేవర మీద ఎలాంటి భయాలు ఉన్నాయో, మూడు ఫ్లాపుల తర్వాత శంకర్ తీస్తున్నాడు కాబట్టే గేమ్ చేంజర్ మీద కూడా అలాంటి భయాలే ఉన్నాయంటున్నారు. ఇలా వీళ్ల కొత్త సినిమాల మీద వన్ పర్సెంట్ డౌట్లతో ఫేట్లు మారేలా ఉన్నాయి.