పాన్ వరల్డ్ టైటిల్, మహేష్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. గరుడ కాదు..

రాజమౌళి సినిమాలు ఎలా ఉన్నా సరే జనాలకు నచ్చేస్తాయి. ఇక రాజమౌళి చేసే మార్కెటింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఏ సినిమా చేసిన సరే దానికి మార్కెటింగ్ గట్టిగా చేస్తూ ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళుతూ ఉంటాడు జక్కన్న.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2025 | 01:22 PMLast Updated on: Feb 10, 2025 | 1:22 PM

Pan World Title Title Fixed For Maheshs Film Not Garuda

రాజమౌళి సినిమాలు ఎలా ఉన్నా సరే జనాలకు నచ్చేస్తాయి. ఇక రాజమౌళి చేసే మార్కెటింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఏ సినిమా చేసిన సరే దానికి మార్కెటింగ్ గట్టిగా చేస్తూ ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళుతూ ఉంటాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా అలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్ కు వెళ్లిపోవాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు నుంచి కూడా కంప్లీట్ గా సహకారం ఉండటంతో రాజమౌళి వేరే లెవెల్ ప్లానింగ్ తో దుమ్ము రేపుతున్నాడు.

ఇక రాజమౌళి పై నమ్మకంతో మహేష్ బాబు కూడా పెద్దగా కండిషన్ లేదు పెట్టడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి.. దాదాపు అప్పుడే 10% కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలిన 90% కోసం విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలోనే కెన్యాలోని నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందు ఆమె హీరోయిన్ అనుకున్నా సరే తర్వాత మాత్రం విలన్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. త్వరలోనే మహేష్ బాబు సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తుంది. ముంబైలో ఉన్న ప్రియాంక చోప్రా డైరెక్ట్ గా కెన్యా వెళ్లిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ సినిమా టైటిల్ ఏంటి అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రావడం లేదు. అయితే గరుడ అనే టైటిల్ రాజమౌళి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ముందు నుంచి ఇదే టైటిల్లో ఈ సినిమా కోసం వాడుతున్నట్లుగా ప్రచారం ఉంది. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో చేసే సినిమాపై రాజమౌళి కంప్లీట్ గా తానే డెసిషన్ తీసుకుంటున్నాడు.

ఇక తన తండ్రి రాసిన కథ విషయంలో ఎక్కడా మార్పులు చెప్పని.. జక్కన్న ఆ కథతోనే స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ బాగుంటుందని మహేష్ బాబు కూడా తను ఒపీనియన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి మైండ్ లో మరో ఆలోచన ఉందంటున్నాయి టాలీవుడ వర్గాలు. ఇక మహారాజ్ అనే టైటిల్ ను సినిమా కోసం పరిశీలించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఓల్డ్ టైటిల్ అనే టాక్ రావడంతో ఇప్పుడు “జనరేషన్” అనే అర్థం వచ్చేలా ఓ పాన్ వరల్డ్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథకు తరతరాల లింక్ ఉండటంతోనే అలాంటి టైటిల్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని రాజమౌళి బయటకు రానివ్వడం లేదు. ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసిన సంగతి కూడా అధికారికంగా ప్రకటించలేదు. మీడియాలో ఎన్నో వార్తలు వచ్చిన సరే రాజమౌళి నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు.