Punjagutta: డబ్బుల ఎర.. అవకాశాల వల.. నగ్న వీడియోల చెర
ఈమధ్యకాలంలో అమ్మాయిలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఒక్కోక్కరూ ఒక్కో రకంగా ఇబ్బందులకు, ప్రలోభాలకు గురిచేస్తూ ఉంటారు. తాజాగా ఒక అమ్మాయి అవసరాన్ని ఆసరాగా చేసుకొని నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Panjagutta police have registered a case against Chennakesava who is blackmailing a married woman by making nude videos
ఓ వివాహితతో వెబ్ సైట్ కి అవసరమైన నగ్న వీడియోలో ముఖం కనిపించకుండా నటిస్తే రూ. 10 లక్షలు ఇస్తామన్నారు ఒక వ్యక్తి. ఆమెకు డబ్బులు అవసరం కావడంతో మొఖం కప్పేసి నటించేందుకు సిద్దం అయ్యారు. చివరకు ఆమెతో వీడియోలు తీసుకొని తిరిగి ఆమెనే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాడు.
విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల యువతి దిల్సుఖ్ నగర్ లో ఉంటున్నారు. ఈమె మ్యారేజ్ ఈవెంట్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం బోనాల చెన్నకేశవ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈమెతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండే వారు. గత నెలలో ఆమెకు ఫోన్ చేసి తనకు తెలిసిన వాళ్ల వెబ్ సైట్ ఉందని.. దానికి అవసరమైన నగ్నవీడియోలో మొఖం కనిపించకుండా నటిస్తే రూ. 10 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆ యువతి వీడియో చేసేందుకు సిద్దం అయ్యారు. కట్ చేస్తే పంజాగుట్ట లోని ఒక హోటల్ కి రమ్మన్నాడు. మద్యం తాగమని ఆఫర్ చేశాడు. తాను తాగేందుకు నిరాకరించారు. దీంతో ఆమెకు తెలియకుండా జూస్ లో ఆల్కాహాల్ కలిపి ఇచ్చాడు. దానిని తాగిన తరువాత ఆమె మత్తులోకి జారుకున్న సమయంలో ఆమె దేహం పై ఉన్న వస్త్రాలు తీసి నగ్నంగా చిత్రీకరించాడు. ఈవిషయం ఆ యువతికి తెలియలేదు.
కొన్ని రోజుల తరువాత వివాహితకు ఫోన్ చేసి నాకు లక్షరూపాయలు పంపించమని డిమాండ్ చేశాడు. ఆమె నా దగ్గర లేవని సమాధానం ఇవ్వడంతో నీ నగ్న వీడియోలు వెబ్ సైట్లో పెడతానని బెందిరించాడు. ఇలా ప్రతి రోజూ అతని నుంచి వస్తున్న వేధింపులు తాళలేక పంజా గుట్ట పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు. దీంతో చెన్నకేశవపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
T.V.SRIKAR