పాన్ వరల్డ్ కాదు… ఏకంగా Hollywood మూవీనే

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ తో పాన్ ఆసియా మార్కెట్ ని టార్టెగ్ చేశాడు. డ్రాగన్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా మార్కెట్లే టార్గెట్ అంటున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 09:00 PMLast Updated on: Feb 26, 2025 | 9:00 PM

Panworld Is Not Just A Hollywood Movie

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ తో పాన్ ఆసియా మార్కెట్ ని టార్టెగ్ చేశాడు. డ్రాగన్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా మార్కెట్లే టార్గెట్ అంటున్నాడు. మహేశ్ బాబు మాత్రం రాజమౌళి పుణ్యామాని పాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఇలా అంతా పాన్ ఇండియా దాటి, పాన్ ఆసియా, పాన్ వరల్డ్ అంటుంటే, కన్నడ రాఖీ భాయ్ ఏకంగా హాలీవుడ్ మీదే గురిపెట్టాడు. పాన్ వరల్డ్ సినిమా అంటే అది కాదని, హాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ద పడ్డాడు. ఇది నిజంగా విచిత్రమైన నిర్ణయం. ఇంతవరకు పాన్ ఇండియా సినిమాలంటే తెలుగు, హిందీలో మూవీని తీయటం, ఐదారు భారతీయ భాషల్లో రిలీజ్ చేయటం… కాని పాన్ వరల్డ్ అనేసరికి ఇండియన్ భాషల్లో తీసి, ఇంగ్లీష్ లో రిలీజ్ చేయటం అంటున్నారు. కాని పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టాలంటే తీయాల్సింది అలా కాదని తేల్చేస్తున్నాడు రాఖీ భాయ్… ఏకంగా హాలీవుడ్, కన్నడ రెండు వర్షన్స్ లో టాక్సిక్ రాబోతోంది. ఇదే ఇప్పడు సెన్సేషనల్ గా మారింది…

పాన్ ఇండియా హిట్ వస్తే ఏ హీరోకైనా పండగే.. కాని అలా పాన్ ఇండియా లెవల్లో 1000 కోట్ల వసూళ్లు వచ్చాకే నరకం మొదలైతుంది. ఆరేంజ్ హిట్ మళ్లీ పడాలంటే ఏగుడి ముందు ఎన్ని పొర్లు దండాలు పెట్టాలో తెలియదు… ఎంతో అద్రుష్టం ఉంటే తప్ప కత్తిలాంటి పాన్ ఇండియా కథ దొరకదు… ఏదో ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో హిట్ పడేసరికి, తను రాజమౌళి లాంటి బలమైన సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు.అది చేయలేకే బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా 3 ఫ్లాపులు ఫేస్ చేశాడు. తర్వాతే సలార్, కల్కీతో మళ్లీ పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు.చరణ్ కూడా ఆచార్య, గేమ్ ఛేంజర్ ప్లాప్స్ తో ప్రభాస్ ఫేస్ చేసిన పరిస్థితులే ఫేస్ చేస్తున్నాడు. బన్నీ పుష్ప2 హిట్ తర్వాత ఎలా ఆరేంజ్ హిట్ పట్టాలో అని దర్శకుల వేటలో ఉన్నాడు.

కాని ఈ కటౌట్లకంటేముందు ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసిన హీరో ఉన్నాడు. తనే రాకింగ్ స్టార్ రాఖీ భాయ్ యష్. కేజీయఫ్ పార్ట్1, పార్ట్ 2 తో దుమ్ముదులిపిన తను, ఇప్పుడు టాక్సిక్ తో పాన్ వరల్డ్ ఎటాక్ చేయబోతున్నాడు. పాన్ వరల్డ్ ఎటాక్ అంటే ఏదో ఇండియన్ లాంగ్వేజెస్ లో సినిమా తీసి, వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయటం కాదు, ఇంగ్లీష్ లో కూడా ప్యార్ లల్ గా తీసేయటం.అవును యష్ మూవీ టాక్సిక్ విషయంలో రాజమౌళి మించేలా ఆలోచిస్తోంది ఈ సినిమా డైరెక్టర్. మన భాషలో సినిమా తీసి, ఇంగ్లీష్ లో డబ్ చేస్తే అక్కడి జనం చూడటం కష్టం… ఒక్క జాకీ చాన్, బ్రూస్లీ సినిమాలే అప్పట్లో ఆడాయి… జర్మన్,ఇటాలియన్, ఫ్రెంచ్ హిట్ మూవీలు కూడా అక్కడ డబ్ చేస్తే ఫ్లాప్ అయ్యాయి. అందుకే మన భాషలో సినిమా తీసి, ఇంగ్లీష్ లో రిలీజ్ చేయటం కంటే, ఇంగ్లీష్ లో కూడా తీసేయటం బెటర్ అనేది టాక్సిక్ టీం నిర్ణయం.

ఆల్రెడీ షూటింగ్ కూడా ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషలో జరుగుతోంది. ఇక ఇంగ్లీష్ వర్షన్ కి స్క్రీన్ ప్లేస్ కంప్లీట్ గా వేరుగా ఉంటుందట. కల్కీ కూడా హాలీవుడ్ లో ప్రమోట్ చేసినా పెద్దగా రీచ్ కాలేదు. కారనం ఇంగ్లీష్ లో తెరకెక్కపోవటమే… అందుకే హాలీవుడ్ మార్కెట్ లో పోటీ పడాలంటే, ఇంగ్లీష్ లో సినిమా తీయాలని టాక్సిక్ ఫిల్మ్ టీం ఇలాంటి సాహసం చేస్తోంది. మరి మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమాను ఇలానే తీస్తారా? మన భాషలో మూవీతీసి ఇంగ్లీష్ లో డబ్ చేస్తారా అన్నది తేలలేదు. ఒక వేళ పాన్ వరల్డ్ మార్కెట్ లో అడుగు పెట్టాలనేది నిజమే అయితే ఇంగ్లీష్ లో కూడా సినిమాను తీయటమే సరైన నిర్ణయమనే మాట వినిపిస్తోంది. టాక్సికే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా మనదేశం నుంచి రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.