Parinithi Chopra: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్
పొలిటీషన్స్ హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది విషయంలో ఇది జరిగింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఇదే బాటలో నడుస్తోంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పరిణితీ చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధాను పెళ్లాడబోతోంది. చాలా కాలం నుంచి వీళ్ల గురించి వస్తున్న వార్తలను ఇద్దరూ కలిసి నిజం చేశారు.
సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో వీళ్ల ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం, హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. చాలా తక్కువ మంది అత్యంత సన్నిహితుల మధ్యలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు పరిణితి రాఘవ్.
ఈ ఫొటోస్‌ను ఇద్దరు తమ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లలో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కొన్ని నెలల నుంచి గాసిప్స్ వస్తున్నాయి. కానీ నిజానికి వీళ్లు చాలా ఏళ్ల నుంచి లవర్స్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో వీళ్లిద్దరూ క్లాస్‌మేట్స్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరూ క్లోజ్ అయ్యారు. కొన్ని రోజులకే వీళ్ల స్నేహం ప్రేమగా మారింది. కానీ వీళ్ల విషయం మూడు నెలల క్రితం బయటకు వచ్చింది.
ఓ హోటల్‌లో డిన్నర్ చేసి వస్తుండగా మీడియా కెమెరాకు చిక్కారు వీళ్లిద్దరు. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నారంటూ తెగ గాసిప్స్ వచ్చాయి. కానీ ఇద్దరిలో ఎవరూ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. దీంతో ఇవి వట్టి రూమర్స్ అనుకున్నారంతా. కానీ ఇలా చాలా ఫంక్షన్స్ మీటింగ్స్‌కు ఇద్దరూ కలిసి వెళ్లారు. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అంతా ఫిక్స్ అయ్యారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ లవర్స్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్స్‌గా మారబోతున్నారు.