హరిహర వీరమల్లులో పవన్ చిన్న కూతురు, అందుకే రష్యా నుంచి…?

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంజన ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించిన ఫోటోలు వార్తలే. అసలు ఇన్నాళ్ళు ఆమె ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 4, 2024 | 12:45 PMLast Updated on: Oct 04, 2024 | 12:45 PM

Pawan Daughter In Harihara Veeramallu Movie

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంజన ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించిన ఫోటోలు వార్తలే. అసలు ఇన్నాళ్ళు ఆమె ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అనూహ్యంగా అంజనా తిరుమలలో ప్రత్యక్షం కావడంతో అందరూ కంగుతిన్నారు. ఆమె అప్పుడే పవన్ కళ్యాణ్ హైట్ ఉండటంతో అసలు ఏం చదువుతుంది అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక అంజనా ఇప్పుడు సినిమాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.

అంజనాకు సినిమాలంటే ఆసక్తి ఉందట. ముఖ్యంగా తన తండ్రి సినిమాల్లో తండ్రి పక్కనే కనపడాలని కోరికగా ఉందట. అందుకనే హరిహర వీరమల్లు సినిమాలో ఆమె కోసం 10 నిమిషాలు ఉండేలా ఓ పాత్ర కూడా సిద్దం చేసారట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం. అంజనా విషయంలో పవన్ కళ్యాణ్ చాలా శ్రద్దగా ఉంటారట. ఆమె ఎక్కువగా రష్యాలో ఉండటం, అక్కడి చల్లటి వాతావరణం ఉండటంతో ఎక్కువగా ఆమెను హైదరాబాద్ కంటే ఊటీలో ఉంచుతున్నారట పవన్. సినిమాల కోసమే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారని టాక్.

ఇక్కడి వేడి వాతావరణం కారణంగా ఆమె ఇబ్బంది పడటంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక తిరుమలకు పవన్ తో కలిసి అంజనా వెళ్ళడం అటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. మరి అంజనా సినిమాల్లో నటిస్తారా లేదా తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మెగా డాటర్స్ లో ఎవరూ సినిమాల్లో సక్సెస్ కాలేదు. ఇక అంజనాకు గ్లామర్ ఉండటం, ఆమెకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉండటంతో పవన్ కళ్యాణ్ స్వయంగా దగ్గరుండి చూస్తున్నారట. అంజనా ఈ రోజు మధ్యాహ్నమే ఊటీ వెళ్లినట్టు సమాచారం.