Pawan Kalyan: విమానం కావాలి.. లేదంటే తూచ్
పవర్ స్టార్ తో సినిమా అంటే నిర్మాత నిండా మునగాల్సిందే అన్నట్టు ఓ వార్త వైరలైంది. ఇప్పుడు ఈ హీరోతో సినిమా పూర్తి చేయాలంటే ఏ నిర్మాత అయినా, విమానం సమర్పించుకోవాల్సిందేనట. ఏరో ప్లేస్ సమర్పిస్తే కాని పవన్ సెట్లో అడుగు పెట్టడట..నిజమా? యాంటీ ఫ్యాన్స్ మహిమా? టేకేలుక్

Pawan demanded a special chartered flight from Mangalagiri to come to Hyderabad for shooting
పవర్ స్టార్ మీద ఓ వైపు లేనివి ఉన్నట్టు ఫీలర్లు క్రియేట్ చేస్తున్నారనే కామెంట్లు పెరిగిన టైంలో, పవన్ మీద కొత్త ఎలిగేషన్ వచ్చింది. పవన్ సినిమా తీయాలంటే తనకి విమానం కావాల్సిందేనట. అంటే సొంతంగా కాదుకాని, తను షూటింగ్స్ కి అటెండ్ కావాలంటే చార్టర్డ్ ఫ్లైట్ వేయాల్సిందేనట.
ఏదో టూర్ కి బస్ వేసినట్టు, పవన్ సెట్లో అడుగుపెట్టాలంటే మంగళగిరి టూ హైద్రబాద్ రెండురోజులకోసారి చార్టర్డ్ ఫ్లైట్ వేయాలనేది పవన్ కండీషనని ప్రచారం పెరిగింది. 2019 లో పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నా వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అలా తను రావటానికి విజయవాడ నుంచి హైద్రాబాద్ కి దిల్ రాజు చార్టర్డ్ ఫ్టైట్ వేశాడట.
సో ఇప్పుడు మంగళగిరిలో పొలిటికల్ జర్నీలో ఉన్న పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ల కోసం హైద్రబాద్ రావాలంటే విమానం అరేంజ్ చేయాల్సిందేనట. డీవీవీ దానయ్య, నవీన్ యేర్నేని ఇలా ఈ ఇద్దరు నిర్మాతలు వాళ్ల సినిమా షూటింగ్స్ కోసం పవన్ కి రెండురోజులకోసారి చార్టర్డ్ ఫ్లైట్ అంటే, ఖర్చు తడిసి మోపెడవుతుందని, పవన్ ని నమ్ముకుంటే నిర్మాతల పని అంతేనని, ఇలా రకరకాల గుసగుసలు పెరిగాయి. ఐతే ఇవన్నీ పవర్ స్టార్ యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రూమర్లనే మాట కూడా వినిపిస్తున్నా, వకీల్ సాబ్ ఎగ్జాంపుల్ మాత్రం అబద్దం కాదు కదా అంటూ కౌంటర్లు వినిపిస్తున్నాయి.