సడన్ గా నందమూరి, పవర్ సపోర్ట్ … 1000 కోట్లకు తగ్గేదిలేదు..
పుష్ప 2 కి నందమూరి యంగ్ టైగర్ సపోర్ట్ దొరికింది. విచిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని స్టేట్ మెంట్ వచ్చింది. దీనికి తోడు పోటీ ఇస్తాడనుకున్న గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ ఛేంజర్ వాయిదా పడింది... కరెక్ట్ గా కొన్ని వారాల క్రితం, పుష్ప 2 వస్తేనే బ్యాన్ చేస్తా అన్నారు.
పుష్ప 2 కి నందమూరి యంగ్ టైగర్ సపోర్ట్ దొరికింది. విచిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని స్టేట్ మెంట్ వచ్చింది. దీనికి తోడు పోటీ ఇస్తాడనుకున్న గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ ఛేంజర్ వాయిదా పడింది… కరెక్ట్ గా కొన్ని వారాల క్రితం, పుష్ప 2 వస్తేనే బ్యాన్ చేస్తా అన్నారు. పుష్ప 2 రాగానే, స్క్రీన్లు చింపేస్తామన్నారు. కట్ చేస్తే కొన్ని వారాల గ్యాప్ లోనే సీన్ మారిపోయింది. దేవర రికార్డులు పుష్ప2 కి బర్డెన్ గా మారాలి. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడన్ గా అల్లు ఆర్మీకి తోడయ్యేలా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా బన్నీ బావ కోసం రంగంలోకి దిగుతున్నాడు. అదేంటో పవర్ స్టార్ ఫ్యాన్స్ బన్నీ మీద ఎంత ఫైర్ అయినా, పవన్ లాంటి వ్యక్తే బన్నీకి భయంకరమైన శక్తినిస్తున్నాడు. అంతగా ఈ గ్యాప్ లో ఏం మతలబు జరిగింది. సోషల్ మీడియాలో తిట్టిన తిట్లు తిట్టుకోకుండా మరీ తిట్టుకకున్న ఇద్దరి ఫ్యాన్స్ పరిస్థితేంటి? ఈ మొత్తం సీన్ వెనకున్న లాజిక్ ఏంటో చూసేయండి.
పుష్ప2 మూవీకి ఒక్కొక్కటిగా పాజిటివ్ పవనాలు కలిసొచ్చేలా ఉన్నాయి. పుష్ప 2 మూవీ అసలు డిసెంబర్ లో రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానాలుండేవి. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్మీ సోషల్ మీడియా వార్ దెబ్బతో, ఇక పుష్ప2 మీద మెగా, పవర్ ఫుల్ ఫ్యాన్స్ దాడి భారీగా ఉంటుందనుకున్నారు. దీనికి తోడు వైసీపీ నేతకు సపోర్ట్ చేయటం వల్లే టీడీపీ ఫ్యాన్స్ అండ్ మెంబర్స్ కూడా పుష్ప2 కి వ్యతిరేకం అనేశారు
తీరా చూస్తే, పవన్ భారీ స్టేట్ మెంట్ షాక్ ఇచ్చింది. బన్నీ, తారక్, నాని, బాలయ్య, ప్రభాస్ ఇలా హీరోలంతా బాగుండాలని కోరుకుంటానన్నాడు. అలా తన స్పీచ్ లో చెప్పిన లిస్ట్ లో బన్నీ పేరుని స్కిప్ చేయకుండా క్లియర్ కట్ గా తనకి, అల్లు అర్జున్ మీద ఎలాంటి కోపం లేదని తేల్చేశాడు
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారా? లేదంటే వాళ్లు తన అభిమాన హీరో మాటలనే ఫాలో అవుతున్నారా అనేది తేలాలంటే, పుష్ప 2 రావాలి… అప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఏదైనా ఇష్యూస్ ఉంటాయా? అంతా సర్ధుకుంటుందా అనేది ఫిజికల్ గా తేలుతుంది
ప్రస్థుతం సోషల్ మీడియాలో మాత్రం పుష్ప2 మీద ఎలాంటి కామెంట్లు, ట్రోలింగ్స్ లేవు. మరి ట్రైలర్ వస్తే కూడా ఇంకాస్త క్లారిటీ రావొచ్చు. నిజానికి ఏపీ ఎలక్షన్స్ టైంలో బన్నీ వెల్లి వైసీపీ నేతకి సపోర్ట్ చేయటం వల్లే, టీడీపీ, జనసేన, అలానే మెగా హీరోలు, వాళ్ల అభిమానులకు దూరం అయ్యాడు అన్నారు.
కారణాలేమైనా, అల్లు అర్జున్ తన అనుకున్న వాళ్లకోసమే ఎక్కడికైనా వెళ్తా అన్నాడు
కాని ఓ సినిమా ఫంక్షన్ లో నా అనుకున్న వాళ్లకోసం ఎక్కడికైనా వెళ్తా అన్నా మాట తో మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా జనసైనికులు ఫైర్ అయ్యారు. ఇన్ని జరిగాయి. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ హీరో మీద కోపం లేదు. అందరు బాగుండాలి, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందనే మాట అనంట ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేసింది. సో అల్టీ మేట్ గా ఎన్నడూ, ఏ హీరో మరో హీరోని తిట్టడమో, తనతో గొడవకు దిగటమో జరగదని మరో సారి ప్రూవ్ అయ్యింది.
అనవసరంగా ఒక హీరో ఫ్యాన్స్ మరో స్టార్ తాలూకు ఫ్యాన్స్ తో గొడవ పడి అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు. టైం సోషల్ మీడియాలో గడిపేస్తారు. కాని రియాలిటీ చూస్తే, స్టార్స్ అంతా ఒకటే. మహా అయితే దూరం దూరంగా ఉంటారేమోకాని, ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు, తిట్టుకున్నాట్టు తిట్టుకోరుగా… అది సంగతి..