Pawan Kalyan: నెలకి 25 రోజులు.. పవన్ ఫ్యాన్స్‌కి పండగ..
నెలకి రెండు సినిమాలకు వేరు వేరు డేట్లిచ్చి, షూటింగ్ పూర్తిచేయాలనుకుంటున్నాడు పవన్. వారాహి యాత్ర ముగియటం, ఏపీలో ముందస్తు ఎన్నికలు కాకుండా, మార్చ్ వరకు టైం ఉందని క్లారిటీ రావటంతో, పవన్ లెక్కలు మారాయి.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. రెండో షెడ్యూల్ సెప్టెంబర్ 5కి మొదలై 20 కి పూర్తౌతుందట. తర్వాత 25 నుంచి 30 వరకు సుజిత్ మూవీ ఓజీ షెడ్యూల్ షురూ అవనుందట. ఇలా నెలకి రెండు సినిమాలకు వేరు వేరు డేట్లిచ్చి, షూటింగ్ పూర్తిచేయాలనుకుంటున్నాడు పవన్. వారాహి యాత్ర ముగియటం, ఏపీలో ముందస్తు ఎన్నికలు కాకుండా, మార్చ్ వరకు టైం ఉందని క్లారిటీ రావటంతో, పవన్ లెక్కలు మారాయి.
ఉస్తాద్ భగత్ సింగ్‌ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడట. అందుకే సెప్టెంబర్‌లో 15 రోజులు, అక్టోబర్‌లో 1 నుంచి 20 వరకు, నవంబర్‌లో ఏకంగా 25 రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడట. దీంతో అక్టోబర్‌లో 21 నుంచి 25 వరకు, నవంబర్‌లో 26 నుంచి 30 వరకు ఇలా ప్రతీనెల 5 రోజులే ఓజీ సినిమాకు పవన్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఎలా చూసినా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి మాస్ మూవీని సంక్రాంతికి రంగంలో దింపాలని పవన్ ధృడనిశ్చయంతో ఉన్నాడని సమాచారం అందుతోంది. సో ఎలక్షన్స్‌కి కాస్త ముందుగగా పవనిజం బాక్సాఫీస్‌ని ఊపటం ఖాయమైంది.