Pawan Kalyan: ప్రెజర్‌లో పవన్ కళ్యాణ్.. సీన్‌లోకి మహేశ్ బాబు!
మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ చేశారు. 8 రోజుల షూటింగ్ పూర్తి చేసి, అప్పుడే టీజర్ అంటే పవన్ నో అన్నాడట. కాని హరీష్ శంకర్ పట్టుపట్టాడని తెలుస్తోంది. దీని వెనక పెద్ద ప్లానింగే ఉన్నట్టు తెలుస్తోంది.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఊహించనంత ప్రెజర్ పెరిగింది. అదేదో షూటింగ్స్ వల్ల అనుకుంటే పొరపాటే. ఇదంతా డైరెక్టర్ హరీష్ శంకర్ వల్లే అంటున్నారు. మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ చేశారు. 8 రోజుల షూటింగ్ పూర్తి చేసి, అప్పుడే టీజర్ అంటే పవన్ నో అన్నాడట.
కాని హరీష్ శంకర్ పట్టుపట్టాడని తెలుస్తోంది. దీని వెనక పెద్ద ప్లానింగే ఉన్నట్టు తెలుస్తోంది. మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ మాత్రమే లాంచ్ చేయటం లేదట. టీజర్ లాంచింగ్ ప్లాన్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కూడా అప్పుడే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి లేదా ఉగాదికి ఈ మూవీ రిలీజ్ డేట్ ఉండేలా ఎనౌన్స్ మెంట్ ప్లాన్ చేశాడట హరీష్ శంకర్. ఒకసారి అలా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే, చచ్చినట్టు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ని వేగంగా పూర్తి చేయాల్సి వస్తుంది. అలా అయితే ఓజీ, హరి హర వీరమల్లు పక్కకు పోయినా.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే వేగంగా పూర్తి చేయాల్సి వస్తుంది.
ఇది హరీష్ ప్లాన్ అని, ఆ విషయంలోనే పవన్ మీద ఈ దర్శకుడు ప్రెజర్ పెంచుతున్నాడని తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు విషయానికొస్తే, మే 11న పవన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వస్తుంటే, ఎగ్జాక్ట్ గా 20రోజుల తర్వాత సూపర్ స్టార్ మూవీ గ్లింప్స్ రాబోతోంది. సో పవన్ కంటే మహేశ్ 20 రోజుల వెనకబడుతున్నాడనే చర్చజరుగుతోంది. మొత్తానికి ఈ ఇద్దరి కొత్త సినిమాల సరికొత్త టీజర్ల మీదే చర్చ జరుగుతోంది.