Pawan Kalyan and Mahesh: పవన్‌ కళ్యాణ్, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు.. మే నెలలో ఫ్యాన్స్‌కు పండగే పండగ..

ఓ పెద్ద హీరో సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తోంది అంటే అతని ఫ్యాన్స్‌లో ఉండే ఆతృత అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ ఇస్తారా.. కొత్త లుక్స్‌ చూపిస్తారా, సాంగ్స్‌ రిలీజ్‌ చేస్తారా అంటూ ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. ఒక్క హీరో గురించే సీన్‌ ఇలా ఉంటే.. మే నెలలో ఏకంగా ముగ్గురు హీరోల గురించి అప్‌డేట్స్‌ రానున్నాయి. అది కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవరస్టార్‌ పవన్‌ కల్యాణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమా నుంచి అప్‌డేట్స్‌ రానున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 02:16 PMLast Updated on: May 09, 2023 | 2:16 PM

Pawan Kalyan And Mahesh Jr Ntr Movie Updates In May Month

ఇంకేముందు మేలో బ్యాండ్‌ బజాయించేందుకు రెడీ అవుతున్నారు ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్‌. తమిళ్‌ డైరెక్టర్‌ సముద్రఖని దర్శకత్వంలో వినోదయాసితం సినిమాను తెలుగులో రీమేక్‌ చేశాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ సినిమాలో హీరో సాయిధరమ్‌తేజ్‌ అయినప్పటికీ పవన్‌ కల్యాణ్‌ కీ రోల్‌ చేశాడు. దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 13 రివీల్‌ చేస్తారంటూ టాక్‌ నడుస్తోంది. ఇక మహేష్‌ బాబు కూడా త్రివిక్రం శ్రీనివాస్‌తో కలిసి తన 28వ సినిమా తీస్తన్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను మే31న రివీల్‌ చేయబోతున్నారు మేకర్స్‌. ఇక యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఎన్టీఆర్‌ 30 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మీద ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో హైప్‌ ఉంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ప్రతీ విషయంలో ఎక్స్‌పర్స్ట్‌తో వర్క్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను మే 20న రివీల్‌ చేస్తామంటున్నారు మేకర్స్‌. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ మే నెల మొత్తం పెద్ద హీరోల సినిమా టైటిల్స్‌ రివీల్‌ కానున్నాయి. ఈ విషయంలో ఫ్యాన్స్‌ వార్‌ పెట్టుకోకుండా.. మూవీ అప్‌డేట్స్‌ ఎంజాయ్‌ చేయాలంటున్నారు క్రిటిక్స్‌.