Bro Trailer: బ్రో ట్రైలర్ చూస్తే.. పైసా వసూల్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..
ఆ మధ్య ఈ మూవీ టీజర్ రిలీజైతే అంత రియాక్షన్ రాలేదు. రీసెంట్ గా బ్రో మూవీ ట్రైలర్ ఆడియన్స్ మధ్య వేడుకగా రిలీజయింది. ఇది మాత్రం రచ్చ రచ్చే అనిపించేలా ఉంది. ఆనందం తో పవన్ ఫాన్స్ పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్స్ వేసేస్తున్నారు.

Bro Film Trailer looking like Commectial Comedy Entertainer
ఇక ట్రైలర్ కంటెంట్ విషయానికి వస్తే .. భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వడికీ ఛాన్స్ ఇవ్వడు’ అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సాయి తేజ్ ను.. టైమ్ లేదు టైమ్ లేదు అంటూ చూపించారు. అతడి ప్రేయసిగా కేతికా శర్మను చూపించారు.
తేజ్.. టైమ్ లేదు.. టైమ్ లేదు అంటూ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ను, ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి.. జీవితంలో పరుగులు పెడుతూ జీవిస్తుంటాడు. అదే సమయంలో అతనికి రోడ్డు ప్రమాదం జరిగుతుంది. సరిగ్గా అప్పుడే అతడికి కాలం విలువ తెలియజేయడం కోసం టైమ్ దిగొస్తాడు. అతడే పవన్ కల్యాణ్. ప్రతిదానికి టైమ్ లేదంటావ్ కదా అదే నేను అంటూ పవన్ ను చూపించారు. ఓ రోడ్డు ప్రమాదం హీరో జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? అనే కథాంశంతో సినిమాను తీర్చిదిద్దారని అర్థమవుతోంది.
ఇక ట్రైలర్ చివర్లో పవన్ మేనరిజం డైలాగ్ లు, హుషారు తెప్పించే మార్క్ కామెడీ చేశారు. అయితే ‘జల్సా’ చిత్రంలోని ఐకానిక్ స్టెప్ ను పవన్ మరోసారి చేయడం హైలైట్ గా నిలిచింది. ఇక తమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఈ ట్రైలర్ పవన్ మార్క్ మేనరిజం, సాయితేజ్ కామెడీ, ఎమోషనల్, ఫైటింగ్ సీక్వెన్స్ తో నిండి ఉంది. పవన్ ఫాన్స్ పైసా వసూల్ ట్రైలర్ అంటూ అప్పుడే పండగ చేసుకుంటున్నారు.