Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే..!

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్ మధ్య మంచి అఫెక్షన్‌ ఉంటుంది. వీళ్లిద్దరి అఫెక్షన్‌కు సపరేట్ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌ మీద కనిపిస్తే మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండగే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2023 | 02:58 PMLast Updated on: Feb 22, 2023 | 2:58 PM

Pawan Kalyan And Sai Dharam Tejs Remake Goes On Floors

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. హరిహర వీరమల్లు తరువాత సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి మల్టీ స్టారర్‌ సినిమా చేయబోతున్నారు పవన్‌ కళ్యాణ్‌. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన వినోదయా సీతం సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ సినిమాను ఇవాళ హైదరాబాద్‌లోని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో అఫిషియల్‌గా లాంచ్‌ చేశారు. ఈ ఈవెంట్‌కు చాలా తక్కువ మంది అతిథులు హాజరయ్యారు. దీనికి సంబంధిచిన అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది మూవీ టీమ్‌. పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుకుంటున్న ఫోటలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన వినోదయా సీతం మూవీకి ప్రముఖ యాక్టర్‌, డైరెక్టర్‌ సముద్రఖని దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీని ఆయనే డైరెక్ట్‌ చేయబోతున్నారు. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని టాక్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో.. త్రివిక్రమ్‌ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పవన్‌, సాయిధరమ్‌ సరసన కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా థమన్‌ను ఫిక్స్‌ చేశారు. నేడు అధికారికంగా లాంచ్‌ అయిన ఈ ప్రాజెక్ట్‌.. త్వరలోనే పట్టాలెక్కనుంది.

పవన్‌ సినిమా గురించి వచ్చిన ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో మల్టీ స్టారర్‌ సినిమా వస్తుండటంతో.. సినిమాపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. తమిళ్‌లో ఈ సినిమా ఇప్పటికే సూపర్‌ హిట్‌ అవడంతో తెలుగులో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మాట్లాడుకుంటున్నారు‌. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ కూడా నటిస్తుండటంతో సినిమాకు మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. ముందు నుంచి పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్ మధ్య మంచి అఫెక్షన్‌ ఉంటుంది. వీళ్లిద్దరి అఫెక్షన్‌కు సపరేట్ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌ మీద కనిపిస్తే మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండగే అంటున్నారు మూవీ లవర్స్‌.