Bro Movie: బ్రో ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా..
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమా ఓపెనింగ్ కలెక్షన్ అదరగొట్టింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్‌తేజ్ ఇద్దరి కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Pawan Kalyan and Saidharam Tej starrer Bro achieved super collections on the first day
ఇక తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల 24 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 9 కోట్లకు పైగా, కర్ణాటకలో 3 కోట్లకు పైగా, రెస్టాఫ్ ఇండియా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. నిజానికి కొన్ని రోజుల నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చాలా మంది థియేటర్స్‌కు రాలేదు. ఒక వేళ సాధారణ వాతావరణం ఉండిఉంటే కలెక్షన్స్ మరో 20 శాతం ఎక్కువగా ఉండేవి అంటున్నారు ఫ్యాన్స్. వర్షాలు ఉన్నప్పటికీ కలెక్షన్స్ వేగంగా పెరుగుతున్నాయి. రెండో రోజు కూడా థియేటర్స్‌లో సందడి కొనసాగుతోంది. పైగా ఇవాళ, రేపు వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే చాన్స్ ఉంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి బ్రో సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో బ్రో మూవీ టీంతో పాటు.. పవర్‌స్టార్, సాయిధరమ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.