PAWAN KALYAN: పవన్ బిజీ.. ఏపీలో ఎన్నికల తర్వాత పవన్ చేయబోయే మూవీ ఇదే!

ఎన్నికల తర్వాత చేయబోయే సినిమాపై అప్‌డేట్స్ వచ్చేశాయ్. కిక్, రేసుగుర్రం లాంటి మూవీస్‌తో మాస్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో పవన్ మూవీపై అప్‌డేట్ రానుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో మూడేళ్ళ క్రితమే ఓ సినిమాకి ప్రకటన వచ్చింది. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ చేయబోయే మూవీ సురేందర్ రెడ్డితోనే అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 03:15 PMLast Updated on: Dec 02, 2023 | 3:15 PM

Pawan Kalyan And Surender Reddy Combo Movie Will Go On Floors Next Year

PAWAN KALYAN: ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న జనసేనాని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూవీస్ అన్నీ షూటింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్‌తో OG.. ఈ మూడూ షూటింగ్ దశలోనే ఉన్నాయి. కానీ ఎప్పుడొస్తాయన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ మూడు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న OG పవన్‌కల్యాణ్‌ ఫేవరేట్‌ మార్షల్‌ ఆర్ట్స్ జోనర్‌లో తెరకెక్కుతోంది.

Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ చెప్పేసిన సందీప్ వంగా

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టులన్నీ నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఈ సినిమాలన్నీ ఎన్నికల ముందే వస్తాయా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎన్నికల తర్వాత చేయబోయే సినిమాపై అప్‌డేట్స్ వచ్చేశాయ్. కిక్, రేసుగుర్రం లాంటి మూవీస్‌తో మాస్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో పవన్ మూవీపై అప్‌డేట్ రానుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో మూడేళ్ళ క్రితమే ఓ సినిమాకి ప్రకటన వచ్చింది. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ చేయబోయే మూవీ సురేందర్ రెడ్డితోనే అన్నారు. కానీ ఏళ్లు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనుకున్నారు. కానీ బ్రేక్ వచ్చిందంతే.. ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 2020 సెప్టెంబర్ 2న సురేందర్ రెడ్డితో సినిమాని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. పవన్ సన్నిహితుడైన రామ్ తాళ్లూరి నిర్మాత. వెనువెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందనుకున్నారు.

SALAAR-KGF: నీల్ యూనివర్స్ కన్ఫామ్​.. ‘కేజీఎఫ్‌2’తో ‘సలార్‌’ను ముడిపెట్టిన ప్రశాంత్‌నీల్‌..

కానీ అఖిల్‌తో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ డిలే అవ్వడం, ఆ తర్వాత డిజాస్టర్ కావడం.. పవన్ వేరే మూవీస్‌లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఈ మూవీకి సంబంధించి అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. ”యథా కాలమ్.. తథా వ్యవహారమ్” అంటూ సంస్కృత పదాలతో డిజైన్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో ఓవైపు గన్ కల్చర్.. మరోవైపు హైదరాబాద్ నగరాన్ని చూపించారు. సమకాలీన అంశాలకు విభిన్నమైన యాక్షన్‌ కథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు హింట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్‌డేట్ లేదు. త్వరలోనే మరోసారి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని.. ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని టాక్.

ఈ లోగా ఇప్పటికే కమిటైన OG, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలను పవన్ కంప్లీట్ చేసేస్తారని అంటున్నారు. ఈ లోగా సురేందర్ రెడ్డి కూడా మరో యంగ్ హీరోతో ఓ మూవీ తీసి ఏజెంట్ ఫ్లాప్ నుంచి బయటపడే ఆలోచనలో ఉన్నాడట. పవన్- సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టైలిష్ ఫిలిం మేకర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలనే ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.