Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పవర్ స్టార్‌తో ఫొటో పంచుకునే చాన్స్..
పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ డుయోలో వస్తున్న బ్రో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పవర్ స్టార్‌తో పాటు ఆయన హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఫొటోలు కూడా పోస్టర్స్‌లో పబ్లిష్ చేయాలని డిసైడయ్యారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో పడి చచ్చిపోతారో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. జస్ట్ పవర్ స్టార్‌తో ఒక ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ చేయని స్టంట్స్ ఉండవు. ఏదో ఒకటి చేసి ఆయనతో ఫొటో దిగి, దాన్ని లైఫ్ టైం అచీవ్‌మెంట్‌గా ఫీలవుతుంటారు చాలా మంది ఫ్యాన్స్. ఒక్కసారి ఆయనను దగ్గరగా చూస్తే చాలు ఆ కలల్లోనే బతికేస్తుంటారు.
అలాంటి ఫ్యాన్స్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పవర్ స్టార్‌తో పోస్టర్స్‌లో ఫొటోలు పంచుకునే చాన్స్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ డుయోలో వస్తున్న బ్రో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పవర్ స్టార్‌తో పాటు ఆయన హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఫొటోలు కూడా పోస్టర్స్‌లో పబ్లిష్ చేయాలని డిసైడయ్యారు. ఇందుకోసం ఫొటోలు పంపాలంటూ ఫ్యాన్స్‌ను కోరారు. సపరేట్‌గా దీనికోసం ఓ లింక్ కూడా పెట్టి ట్విటర్‌లో పోస్ట్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇంకేముంది లక్షల సంఖ్యలో ఫొటోలు వచ్చిపడుతున్నాయి. ప్రమోషన్స్‌లో పవర్‌స్టార్ సాయిధరమ్ తేజ్ ఫొటోలతో పాటు ఫ్యాన్స్ ఫొటోలను కూడా పోస్టర్స్‌లో వేయబోతున్నారు.
ఈ నెల 28న రానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దేవుడి రోల్‌లో కనిపించబోతున్నాడు. తమిళ్‌లో ఈ సినిమాను తీసిన సముద్రఖని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పవర్‌స్టార్, సాయిధరమ్ తేజ్ డుయో కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.