Panjang vs allu : పంజా-అల్లు వార్…మరింత ముదిరేలా ఉంది
కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు (Mega vs Allu) వార్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయగా సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పిన అల్లు అర్జున్ ..

Pawan Kalyan contested as an MLA from Pithapuram in the recent Andhra Pradesh elections, Allu Arjun said all the best on social media platform.
కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు (Mega vs Allu) వార్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయగా సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పిన అల్లు అర్జున్ .. తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ (YCP) అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని (Shilpa Ravichandra Kishore Reddy) మాత్రం ప్రత్యేకంగా కలిసి తన మద్దతును తెలిపాడు. ఇదే మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అప్పటినుంచి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా బన్నీపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలవడం, తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ లో బన్నీ పట్ల కోపం తగ్గలేదు. ఈ క్రమంలో మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కి ఊహించని షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లో బన్నీని సాయి తేజ్ అన్ ఫాలో చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సాయి తేజ్ కి వివాదరహితుడిగా, సినీ పరిశ్రమలో అందరితో మంచిగా ఉంటాడనే పేరుంది. అలాంటి వ్యక్తి.. అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది.
సాయి తేజ్ కి తన మేనమామ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోతుంటాడు. అంతలా పవన్ ని ఇష్టపడతాడు కాబట్టే.. ఆయన విషయంలో బన్నీ చేసిన దానికి హర్ట్ అయ్యి ఇలా చేసి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సాయి తేజ్ చేసిన పనితో.. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని మరింత టార్గెట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఈ లెక్కన మెగా-అల్లు వార్ మరింత ముదిరే అవకాశముంది.