చరణ్‌ని చూసి నేర్చుకో బన్నీకి సైలెంట్‌గా రాడ్డు దింపిన పవన్‌

అల్లు మెగా ఫ్యామిలీస్‌ మధ్య వచ్చిన గ్యాప్‌ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ఇటు మెగా ఫ్యాన్స్‌ అటు అల్లు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2025 | 02:29 PMLast Updated on: Jan 06, 2025 | 2:29 PM

Pawan Kalyan Counter To Allu Arjun

అల్లు మెగా ఫ్యామిలీస్‌ మధ్య వచ్చిన గ్యాప్‌ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ఇటు మెగా ఫ్యాన్స్‌ అటు అల్లు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో బన్నీ అరెస్ట్‌ అయినప్పుడు మెగా ఫ్యాన్స్‌ అంతా ఇంతా ట్రోల్‌ చేయలేదు. ఈ క్రమంలో గేమ్‌ ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ను ఆకాశానికెత్తేశాడు పవన్‌ కళ్యాణ్‌. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం రామ్‌ చరణ్‌ది అంటూ పొగిడాడు. అదే సమయంలో ఇండైరెక్ట్‌గా బన్నీ గురించి కూడా కామెంట్స్‌ చేశాడు. మెగా ప్రతీ హీరో ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం కేవలం చిరంజీవే నంటూ చెప్పాడు.

తాను ఎంత ఎదిగినా మూలాల్ని మాత్రం మర్చిపోలేదని చెప్పాడు. ప్రతీ ఒక్కరూ ఏ స్థాయిలో ఉన్నా.. తన మూలాల్ని మర్చిపోకూడదంటూ పేరు చెప్పకుండానే బన్నీకి క్లాస్‌ తీసుకున్నాడు. రీసెంట్‌గా కూడా అల్లు అర్జున్‌ గురించి కీలక కామెంట్లు చేశాడు పవన్‌. గోటితో పోయే వ్యవహారాన్ని అల్లు అర్జున్‌ గొడ్డలి వరకూ తెచ్చుకున్నాడంటూ చెప్పాడు. ఘటన జరిగిన మరుసటి రోజే వెళ్లి ఆ కుటుంబానికి సాయంగా నిలబడితే ఇంత జరిగేది కాదని చెప్పాడు. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూడాలని ప్రతీ ఒక్కరికీ ఉన్నా.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి బాధ్యత హీరో మీద ఉంటుందంటూ చెప్పాడు. దీంతో ఇప్పుడు పవన్‌ చేసిన కామెంట్స్‌ను కూడా బన్నీకి లింక్‌ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. జీవితంలో మూలాలు మర్చిపోవద్దని పవన్‌ చెప్పిన మాటను.. బన్నీకి కౌంటర్‌గానే చెప్పారంటూ వైరల్‌ చేస్తున్నారు.