Pawan Kalyan: మీకు ఏళ్లు కావాలేమో.. నాకు నిమిషాలు చాలు..
లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్‌కు 380 నిమిషాల్లోనే 1.7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇంత ఫాస్ట్‌గా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఇప్పుడు పవనే నెంబర్ వన్.

Pawan Kalyan: స్టార్లందు పవర్ స్టార్ వేరయా! ఇది పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ అంతా గర్వంగా చెప్పుకునే మాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు అనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్‌కు 380 నిమిషాల్లోనే 1.7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇంత ఫాస్ట్‌గా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఇప్పుడు పవనే నెంబర్ వన్.
ఎప్పుడూ హంగులు ఆర్బాటాలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సోషల్ మీడియా వాడేవాడు కాదు. జనసేన పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన తరువాత ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. తన ఆలోచనలను ట్విటర్ ద్వారా పంచుకునేవాడు. అధికారపక్షంపై విమర్శలు చేసేవాడు. ట్విటర్‌లో కూడా పవన్ కళ్యాణ్‌కు లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తీయగానే అక్కడ కూడా భారీగా ఫాలోవర్స్ వచ్చారు పవన్ కళ్యాణ్‌కు. ఇప్పటి వరకూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు 23 రోజుల్లో, రాంచరణ్‌కు 74 రోజుల్లో, మహేష్ బాబుకు 89 రోజుల్లో, అల్లు అర్జున్‌కు 184 రోజుల్లో, జూనియర్ ఎన్టీఆర్‌కు 416 రోజుల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. నిజానికి వీళ్లంతా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే. కానీ మిలియన్ ఫాలోవర్స్ దాటేందుకు చాలా రోజులు టైం పట్టింది.
కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం జస్ట్ 380 నిమిషాల్లోనే 17 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మీ అందరికీ రోజులు కావాలేమో.. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం నిమిషాలు చాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఏది ఏమైనా పవర్ స్టార్ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చి తనకు మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రూవ్ చేసుకున్నాడు.