pawan : పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా
‘అజ్ఞాతవాసి‘ (Ajnathavasi) తర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. ‘వకీల్ సాబ్‘తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2021లో ‘వకీల్ సాబ్‘ (Vakil Saab) విడుదలైతే.. 2022 లో ‘భీమ్లా నాయక్‘, 2023లో ‘బ్రో‘ (Bro) సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించాడు.
‘అజ్ఞాతవాసి‘ (Ajnathavasi) తర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. ‘వకీల్ సాబ్‘తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2021లో ‘వకీల్ సాబ్‘ (Vakil Saab) విడుదలైతే.. 2022 లో ‘భీమ్లా నాయక్‘, 2023లో ‘బ్రో‘ (Bro) సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించాడు. రీ ఎంట్రీలో ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేస్తోన్న పవన్.. ఈ సంవత్సరం మాత్రం రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ‘ (OG) సినిమా సెప్టెంబర్ 27న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్ట్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. ఎన్నికల పూర్తైన తర్వాత పవర్ స్టార్ కొన్ని రోజుల పాటు ‘ఓజీ‘ చిత్రీకరణలో పాల్గొంటే సరిపోతుందట. ఇక.. ‘ఓజీ‘ తర్వాత ఇదే ఏడాది ‘హరి హర వీరమల్లు‘తోనూ ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి రాబోతున్నాడు పవర్ స్టార్.
క్రిష్, జ్యోతికృష్ణ కంబైన్డ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు‘ రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాదే విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ గా రిలీజైన టీజర్ లో తెలిపారు. అయితే.. ఎన్నికల పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ ను బట్టే ‘హరి హర వీరమల్లు‘ విడుదల ఎప్పుడు ఉంటుంది? అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంమీద.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. పవర్ స్టార్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు రావడం పక్కా.