Pawan Kalyan: సూపర్ సర్‌ప్రైజ్‌తో పవన్ ఫ్యాన్స్‌లో ఇంకా పెరగనున్న ప్రెజర్..
ఓజీ సినిమా షూటింగ్ 60 శాతం అయ్యింది. ఆ లెక్కన ఇదే క్రిస్మస్‌కి కాని, సంక్రాంతికి కాని రావాలి. విచిత్రం ఏంటేంటే ఎలక్షన్స్‌కి ముందు మంచి మాస్ మూవీ రిలీజ్ అయితే బాగుంటుందని పవనే ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమన్నాడట.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో సుజిత్ తీస్తున్న ఓజీ గ్లింప్స్ పవన్ బర్త్ డే రోజైన శనివారం ఉదయం రిలీజ్ కాబోతుంది. అంతా బానే ఉంది. ఫ్యాన్స్‌లో ఆ సందడి పెరిగింది. కాని ఈ గ్లింప్స్ వల్ల ఇప్పుడు కొత్త తలనొప్పి వస్తోంది. అదేంటంటే పవన్ చిత్రాల్లో ముందుగా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మూవీ ఓజీనా, లేక ఉస్తాద్ భగత్ సింగా? అనే సందేహం కలుగుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వేయిట్ చేస్తున్నారు.
ఎఫ్ 2 మూవీలో ఓ డైలాగ్‌లా, అమ్మాయికి ఏం పెడుతున్నారంటే ఉన్నదంతా ఇద్దరమ్మాయిలకే అంటారు. ఉన్నదెంత అంటే ఎంతుంటే అంతా అని చెబుతారు. అంటే ఏదీ తేల్చకుండా జవాబు చెప్పటం అనే స్టైల్ ఇది. అచ్చంగా పవన్ కొత్త సినిమాల విషయంలో నిర్మాతలు ఇలాంటి పద్దతినే ఫాలో అవుతున్నట్టున్నారు. ఓజీ సినిమా షూటింగ్ 60 శాతం అయ్యింది. ఆ లెక్కన ఇదే క్రిస్మస్‌కి కాని, సంక్రాంతికి కాని రావాలి. విచిత్రం ఏంటేంటే ఎలక్షన్స్‌కి ముందు మంచి మాస్ మూవీ రిలీజ్ అయితే బాగుంటుందని పవనే ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమన్నాడట. అలానే హరీష్ శంకర్ కూడా మూడునెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు.
కానీ, మళ్లీ ఇప్పుడు క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి ఓజీ రిలీజ్ అన్నమాటే వినిపిస్తోంది. ఈ విషయంలో ఎక్కడా అఫీషియల్ క్లారిటీ లేదు. అందుకే రెండీంట్లో ఏది ముందు వస్తుందో తెలియడం లేదు. నిజంగానే క్రిస్మస్‌కి లేదంటే సంక్రాంతికి పవన్ మూవీ వస్తుందా..? ఇలాంటి ప్రశ్నలు పవన్ ఫ్యాన్స్‌ని ప్రెజర్‌లోకి నెడుతున్నాయి.