Pawan Kalyan: ఫ్యాన్స్ రచ్చ.. మంటల్లో థియేటర్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా 2012లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకు దూసుకుపోతుంది. అయితే, ఒక థియేటర్‌లో పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోపల మంటపెట్టారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు పవన్ ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. థియేటర్‌ని అందంగా అలంకరించడం దగ్గరనుంచి స్క్రీన్ మీద పవన్ కనపడే వరకు రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ థియేటర్‌లో చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా 2012లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ అయ్యింది.
Yatra 2 Review: వైఎస్ జగన్ బయోపిక్.. యాత్ర 2 మెప్పించిందా..? సినిమా ఎలా ఉంది..?
విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకు దూసుకుపోతుంది. అయితే, ఒక థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోపల మంటపెట్టారు. తమ వెంట తెచ్చుకున్న పేపర్స్‌తో మంట ఏర్పాటు చేసి ఆ మంట చుట్టు తిరుగుతు డాన్స్ చేసారు. దీంతో థియేటర్ యాజమాన్యం షోని మధ్యలోనే ఆపివేసింది. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన అల్లరిని మాత్రం మానలేదు. సదరు ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా.. జర్నలిజం ఎలాంటి విలువలని కలిగిఉండాలని చెప్పడంతో పాటుగా ప్రజలని రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులూ ఆడే డ్రామాలా గురించి కూడా చర్చించింది.
పవన్ సరసన తమన్నా కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మణి శర్మ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ప్రేక్షకులని బాగానే అలరించాయి.పవన్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అప్పట్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని సంపాదించుకుంది.