Pawan Kalyan: పవన్‌కి హరీష్ శంకరే కరెక్ట్.. త్రివిక్రమ్ కాదు..?
రీసెంట్‌గా గ్లాస్ అంటే.. సైజ్ కాదు.. సైన్యం అంటూ ఫిల్మ్ టీం రివీల్ చేసిన టీజర్ పేలింది. ఏపీలో పొలిటికల్‌గా పవన్‌కి బాగానే మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఐతే ఈ ప్రోమో చూసిన సగటు పవన్ అభిమాని, పవన్‌తో సినిమా తీస్తే హరీష్ శంకరే బెటర్ అంటున్నారు.

Pawan Kalyan: పవన్‌కి కరెక్ట్ అంటే హరీష్ శంకరే అని, త్రివిక్రమ్ కాదనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తోంది. ఈ ఒక్క మాటతో డైరెక్టర్ హరీష్ శంకర్‌కి కొండంత బలం వచ్చినట్టైంది. ఇంతకాలం తన అభిమాన హీరో పవన్‌తో సినిమా చేద్దామంటే, త్రివిక్రమ్ తీసుకొచ్చే ప్రాజెక్టులు అడ్డు పడ్డాయి. తర్వాత ఏపీ ఎలక్షన్స్ హంగామా వల్ల పవన్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్‌కి టైం కేటాయించలేకపోయాడు.
Manjummel Boys: కోటికి 100 కోట్లు.. 2 కోట్లకు 200 కోట్లు.. ఇదీ మాలీవుడ్ సత్తా..
అలాంటిది ఇప్పుడు పవనే పిలిచి హరీష్ శంకర్‌తో.. పెండింగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేద్దాం అనేంత వరకు సీన్ మారింది. కారణం ఒకే ఒక్క ప్రోమో. రీసెంట్‌గా గ్లాస్ అంటే.. సైజ్ కాదు.. సైన్యం అంటూ ఫిల్మ్ టీం రివీల్ చేసిన టీజర్ పేలింది. ఏపీలో పొలిటికల్‌గా పవన్‌కి బాగానే మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఐతే ఈ ప్రోమో చూసిన సగటు పవన్ అభిమాని, పవన్‌తో సినిమా తీస్తే హరీష్ శంకరే బెటర్ అంటున్నారు. ఎక్కడ తగ్గాలో త్రివిక్రమ్ చెబితే, ఎక్కడ నెగ్గాలో హరీష్ మూవీలో చూపిస్తాడంటున్నారు. గబ్బర్ సింగ్‌లో పవన్‌ని చూసిన అందరికి పవర్ స్టార్‌ని ఎలా చూడాలనుకున్నారో అలానే చూపించాడు హరీష్ శంకర్.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కూడా అలాగే అంతా హరీష్‌ని మెచ్చుకున్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఎంత బాగున్నా, హీరోని ఎలక్ట్రిఫై అయ్యేలా చూపించటంలో పూరీ తర్వాత హరీష్ వేగం వేరు. అందుకే పవన్.. హరీష్‌ని నమ్ముకుంటేనే బెటర్ అనేలా ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ దొరుకుతోంది ఈ దర్శకుడికి.