తెలుగు సినిమాకు పవన్ భారీ ఆఫర్…

pawan kalyan
ఎస్… తెలుగు సినిమాకు పవన్ కళ్యాణ్ భారీ ఆఫర్ ఇచ్చారు… ఏపీలో స్టూడియో పెట్టుకునేందుకు వంద ఎకరాలను తెలుగు సినిమాకు కేటాయించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇందుకోసం లోకేషన్ కూడా ఫైనల్ అయిపోయింది. అవును ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసేస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ డిప్యూటి సిఎం హోదాలో ఈ భారీ అడుగు ఎందుకు వేస్తున్నారు…? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటీ…? పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి…? ఈ కథనంలో చూద్దాం.
నందిగామ – కంచికర్ల మధ్యలో జాతీయ రహదారికి దగ్గరలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ పరిశ్రమకు కేటాయించేందుకు పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ చేసారు. దీని కోసం ఒక స్థలం కూడా ఎంపిక అయింది. ఇక్కడ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో ఒక స్టూడియో నిర్మాణం చేపడుతుంది. సినిమా షూటింగ్ లను ఇక్కడ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తారు. హైదరాబాద్ కు కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ప్రయాణం ఉంటుంది. ఇక గొల్లపూడి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారి నిర్మాణం కూడా జరిగిపోతుంది.
అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అయితే విజయవాడ నగరానికి సరిగా 40 నిమిషాల ప్రయాణం ఉంటుంది. అమరావతికి కూడా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ సినిమా షూటింగ్ లు చేసుకునే వాళ్లకు కొంత రాయితీలు కూడా కల్పించే ప్లాన్ జరుగుతోంది. స్టూడియోలో షూట్ చేస్తే స్టూడియో యాజమాన్యానికి అద్దె తరహాలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు స్వయంగా ఆ మొత్తం ప్రభుత్వానికే చెల్లిస్తారు. తొలి దశలో వంద ఎకరాల్లో స్టూడియో నిర్మాణం చేపట్టే ప్లాన్ జరుగుతోంది. దీనికి పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా పెద్దలతో సమావేశం కానున్నారు. చంద్రబాబు వద్దకు వారిని తీసుకుని పవన్ వెళ్తారు.
ఇప్పటికే స్టూడియో ప్లాన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక నివేదిక కూడా మంత్రి కందుల దుర్గేశ్ తో కలిసి చేయించారు. ఈ స్టూడియో నిర్మాణం పూర్తి అయితే… ఇప్పటి వరకు హైదరాబాద్ మీద ఆధారపడిన తెలుగు సినిమాను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక చిన్న సినిమాలకు గతంలో రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు అది మళ్ళీ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ పైనే ఆధారపడిన సినిమా జనాలు ఎంత వరకు ఆంధ్రప్రదేశ్ వస్తారనేది చూడాలి.