Pawan Kalyan: హరి హరుడు కూడా వీరమల్లుని కాపాడలేడా.. ఇంకెన్నాళ్లు..?
పవన్ కళ్యాణ్ కి ఏమైంది. పూర్తిగా త్రివిక్రమ్ ఏం చెబితే అదే చేస్తున్నాడా? దాని ఫలితంగానే హరి హర వీరమల్లు షూటింగ్ ఆగటం కాదు, అసలు ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కుతుందా అనే వరకు సీన్ మారుతోంది.

Hari Hara veera Mallu Movie
ఎందుకంటే, హరి హర వీరమల్లు సెట్లో గతంలో ప్రమాదం జరిగింది. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది.. ఇలా షూటింగ్ ని పూర్తి చేయకపోవటం వల్ల నిర్మాత తన పెట్టుబడికి అయిన ఖర్చు వాటి వడ్డీలతో డీలా పడుతున్నాడు. దీనికి తోడు హరి హర వీరమల్లు కోసం వేసిన 12 కోట్ల సెట్ కి అగ్ని ప్రమాధం అంటే అదనపు భారం
హరి హర వీరమల్లు మొదలైనప్పటి నుంచి వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కడం రిలీజవ్వటం జరిగింది. ఇక బ్రో రాబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో ఉంటే, ఓజీ స్పీడ్ అందుకుంది.. ఐదు సినిమాలు చేస్తున్న పవన్ తన డేట్లను హరి హర వీరమల్లుకి మాత్రం కేటాయించలేకపోతున్నాడు… ఎందుకు? ఇవే సగటు ప్రేక్షకుడికి నెటీజన్స్ కి వస్తున్న డౌట్లు.. కాని వాటికి ఆన్సర్లు దొరట్లేదు. దొరికేలా లేవు