Pawan Kalyan: హరిహర వీరమల్లు సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్.. పవన్‌కు తప్పిన ప్రమాదం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

Hari Hara Veeramallu Shooting Set Fire Incident
దుండిగల్ సమీపంలోని బోరంపేట్‌లో హరిహరవీరమల్లు సినిమా కోసం వేసిన సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. యాక్షన్ సీక్వన్స్ షూట్ చేసేందుకు తోట తరణి సారథ్యంలో భారీ సెట్ వేశారు. ఇందులోనే గతంలో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రధాన పాత్రలపై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారు. సినిమా తరువాతి షెడ్యూల్‌ను కూడా ఈ సెట్స్‌లోనే తెరకెక్కించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఆదివారం ఈ సెట్‌లో ఆగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లినట్లు చెబుతోన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో సెట్స్‌లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు.
గతంలో ఇదే సెట్ వరదల కారణంగా కొట్టుకుపోయింది. దాంతో భారీ ఖర్చుతో తిరిగి మరమ్మత్తులు చేశారు. అందులోనే మరోసారి అగ్ని ప్రమాదం జరగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అగ్ని ప్రమాదం గురించి చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితం మొదలైంది. ఇప్పటివరకు కేవలం యాభై శాతం మాత్రమే పూర్తైనట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.
మొఘల్ రాజు ఔరంగాజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీడియోల్ నటిస్తోన్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. హరిహరవీరమల్లు తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ బ్రో, సుజీత్ ఓజీ మూవీస్ షూటింగ్ పూర్తికావోస్తోంది. కానీ హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం చాలా లేట్ అవుతోంది. దీనికి తోడు సినిమాకు వరుస ప్రమాదలు మేకర్స్‌కు మరో తలనొప్పిగా మారాయి.