Pawan Kalyan: మళ్లీ కత్తి పట్టనున్న వీరమల్లు.. కనికరించిన పవర్ స్టార్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండేళ్ల క్రితం సినిమా షురూ చేసిన డైరెక్టర్ క్రిష్. హరి హర వీరమల్లు అంటూ నైజాం కాలం నాటి ఓ యోధుఢి కథతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే, అది సగం పూర్తయ్యాక అటకెక్కింది. పొలిటికల్ గా పవన్ బిజీ అవటం, భీమ్లానాయక్ నుంచి బ్రో వరకు సినిమాలతో గజిబిజి అవటంతో వీరమల్లు కథ మూలనపడిపోయింది.

Pawan Kalyan has given call sheets for the shooting of Hari Hara Veeramallu movie directed by Krish starring Pawan Kalyan as the hero
కట్ చేస్తే హరి హర వీరమల్లు మూవీ కోసం 10 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట పవన్. ఆ డేట్స్ లో టాకీ పార్ట్, కొంత, మరో 20 రోజుల్లో మిగతా టాకీ, యాక్షన్ పార్ట్ తెరకెక్కిస్తాడట క్రిష్. ఆగస్ట్ లో 10 రోజులు, అలానే అక్టోబర్ లో 20 రోజుల కాల్ షీట్స్ ని పవన్ ఇచ్చాడని తెలుస్తోంది.
నిజానికి కంటిన్యూయస్ గా 3 నెలలు షూట్ చేస్తేనే హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కాదు. కాని ఒక నెలలోనే ఈ సినిమాను పూర్తి చేయాల్సిన పరిస్థితి రావటంతో, క్లోజ్ షాట్లు, ఫేస్ కనిపించే షాట్లు పవన్ తో తీసి, మిగతా భాగం డూబ్ ని పెట్టి తెరకెక్కిస్తాడట క్రిష్. ఆల్రెడీ 50శాతం పూర్తైన ప్రాజెక్ట్ విషయంలో కూడా 30శాతం సీన్లు డూబ్ తోనే తెరకెక్కించారనే కామెంట్లున్నాయి. ఇప్పడు పెండింగ్ పార్ట్ కూడా ఎక్కువ శాతం డూబ్ తోనే తెరకెక్కించబోతుండటంతో, ఔట్ పుట్ మీదే సందేహాలు పెరిగేలా ఉన్నాయి.