Pawan Kalyan: ఓ మై గాడ్ “మెగా”వివాదం
ఓ మైగాడ్ 2 ప్రోమో పేలింది. కాని ఈ సినిమా పెను సంచలనం సృష్టించేలా ఉంది. మెగా వివాదం కన్ఫామ్ అయ్యింది. అప్పట్లో ఓమైగాడ్ వస్తేనే, దైవదూషణ అంటూ వివాదం చెలరేగింది. హిందూవులే కాదు ఇతర వర్గాలు కూడా ఓ మై గాడ్ టీం లేవనెత్తిన ప్రశ్నలకు మండిపడింది.

Pawan Kalyan has no problem with Oh My God 2
ఇప్పుడు ఓమైగాడ్ 2 వస్తోంది. ప్రోమో వచ్చిన వెంటనే వివాదం షురూ అయ్యింది. అసలే సినిమాలో కొన్ని డైలాగ్స్ బాలేవని 25 డైలాగ్స్ కత్తిరించింది సెన్సార్ బోర్డు. కొన్ని సీన్లు ఏకంగా మ్యూట్ చేశారట. అంతేకాదు ఇందులో అక్షయ్ కుమార్ దేవుడిగా కాదు, శివుడి అవతారంగా వచ్చినట్టు చూపిస్తే తప్ప మూవీని రిలీజ్ చేయనియ్యమన్నారట.
ఆదిపురుష్ ఎఫెక్ట్ ఓ మై గాడ్ 2 మీద పడిందో, లేదంటే ఓ మైగాడ్ లో ఉన్నట్టే దేవుడిని, మతాన్ని ప్రశ్నించే సీన్ల జోరు సీక్వెల్ లో పెరిగిందో కానీ, ఇది చిలికి చిలికి తుఫాన్ అయ్యేలా ఉంది. ప్రోమోతో మొదలైన కామెంట్ల దాడి, వచ్చే వారం విడుదలయ్యే ఓ మై గాడ్ 2 సందడితో పీక్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఓ మైగాడ్ ని గోపాల గోపాలగా పవన్ రీమేక్ చేస్తే ఇక్కడ వివాదం కాలేదు. కాని ఓ మై గాడ్ 2 ని రీమేక్ చేస్తే పరిస్థితులు ఒకప్పటిలా ఉండకపోవచ్చంటున్నారు.