Pawan Kalyan: ఫెయిల్యూర్స్‌తో కూడా ట్రెండ్ సెట్ చేసింది పవనే..!
రజినీకాంత్‌లానే పవన్ కూడా చాలా సింపుల్ మనిషి. బట్టలు వేసుకోవటం నుంచి బతకటం వరకు దేంట్లోనూ ఓ స్టార్‌లా కనిపించడు పవన్. కాని థియేటర్స్‌లో తను అడుగు పెడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఒక హీరో ప్యాంట్ మీద ప్యాంటేసుకోవటం, షర్ట్ మీద షర్ట్ వేసుకోవటం చూశామా..? అది గుడుంబా శంకర్‌లో చేశాడు పవన్.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి కామన్ పోలికలున్నాయి. అవేంటంటే.. వీళ్లిధ్దరూ యంగ్ ఏజ్‌లో చేసిన కొన్ని చిత్ర విచిత్రమైన పనుల వల్ల, ఏళ్ల తరబడి వీళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతోంది. అంతేకాదు రజినీకాంత్‌లానే పవన్ కూడా చాలా సింపుల్ మనిషి. బట్టలు వేసుకోవటం నుంచి బతకటం వరకు దేంట్లోనూ ఓ స్టార్‌లా కనిపించడు పవన్. కాని థియేటర్స్‌లో తను అడుగు పెడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది.
ఒక హీరో ప్యాంట్ మీద ప్యాంటేసుకోవటం, షర్ట్ మీద షర్ట్ వేసుకోవటం చూశామా..? అది గుడుంబా శంకర్‌లో చేశాడు పవన్. హీరో ఎక్కడైనా లేడీలా జోకులు వేయటం చూశామా..? కాని అప్పట్లోనే పవన్ ఇలాంటి రూట్లో నవ్వించాడు. రెండో ప్రపంచ యుద్దంలో యూరప్ సైనికులు వాడిన డ్రెస్ తాలూకు క్లాత్‌తో ఓ ప్యాంట్ తయారు చేస్తే, ఆ ప్యాంట్‌లో ఒకటి బ్రిటన్ ఫుడ్ బాల్ ప్లేయర్ బెక్ హామ్ వాడాడు. మరొకటి పవన్ కళ్యాణ్ తన బాలు మూవీలో వేసుకున్నాడు. దాని విలువ అప్పట్లో రూ.2 లక్షలు. ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే కోటి 80 లక్షల రూపాయలు. ఇలా బాలులో పవన్ వేసుకున్న ప్యాంట్‌ని చాలా మంది అప్పట్లో వేసుకోవటం, అలాంటివి కుట్టించటం లాంటి ఎన్నో వింతలు జరిగాయి. తమ్ముడులో ఫారెనర్స్‌తో క్యాంటీన్, ఖుషీలో కత్తి ఫైట్.. ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరో చేయని పనులు, ఫీట్లు చేస్తూ, పాట్లు పడ్డాడు పవన్. యూత్‌కి ఏం నచ్చుతుందో అదే చేశాడు.
యంగ్‌స్టర్స్ తమని పవన్‌లో చూసుకునేలా ఏదో ఒక క్రేజీ ఐడియాతో తన మూవీలు చేస్తూ వచ్చాడు. అందుకే పవన్ అంటే ఒక ఎనిగ్మా అంటారు. పవన్ పెద్ద డాన్సర్ కాదు. కమల్, చిరులా ఎక్స్‌ట్రా ఆర్డినరి నటుడేం కాదు. కాని, అదేంటో పవన్ అంటే యూత్‌కి పిచ్చి. అయితే, ఏం చేశాడని చూస్తే, నిజంగానే పవన్ చాలా చేశాడు. పవన్ హీరో అయిన తొలినాళ్లలో స్కూల్లో చదివే పిల్లల నుంచి పెద్దల వరకు ఈ హీరోకి ఫ్యాన్స్ అయ్యారు. వాళ్ల ఏజ్ ఇప్పుడు ఫార్టీ ప్లస్, ఫిఫ్టీ ప్లస్. అందుకే వాళ్ల పిల్లలకి కూడా పవన్ అంటే పిచ్చి. అలా ఆ కాలం యూత్ నుంచి ఈ తరం యూత్ వరకు పవన్‌కి ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు.