Pawan Kalyan: రిలాక్స్ మోడ్‌లో పవన్.. విదేశాల్లో చిల్ అవుతోన్న పవర్ స్టార్..!
ఫ్యామిలీతో గడిపేందుకు పవన్ కల్యాణ్ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే దాదాపు 10 రోజులు ఉండే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ పవన్ భార్య, పిల్లలు సింగపూర్‌లో ఉన్నారని, అందుకే పవన్ కూడా అక్కడికే వెళ్లినట్లు టాక్ నడుస్తోంది.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సినిమాలు, పొలిటికల్ టూర్‌కు బ్రేక్ లు వేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని రోజులుగా అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడిపిన పవన్ కల్యాణ్.. రెస్ట్ మోడ్‌లోకి వెళ్తున్నట్లు టాక్ నడుస్తోంది. విదేశాల్లో దాదాపు వారం రోజుల పాటు చిల్ అవ్వనున్నట్లు ఓ న్యూస్ వైరల్‌గా మారుతోంది. పవన్ వారం రోజులుగా సినిమాలు, రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రీసెంట్‌గా బ్రహ్మానందం కొడుకు పెళ్లిలో సందడి చేసిన పవన్.. ఆ తర్వాత విదేశాలకు వెళ్లినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఫ్యామిలీతో గడిపేందుకు విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే దాదాపు 10 రోజులు ఉండే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ పవన్ భార్య, పిల్లలు సింగపూర్‌లో ఉన్నారని, అందుకే పవన్ కూడా అక్కడికే వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఓవైపు ఫ్యామిలీతో చిల్ అవుతున్న పవన్.. ఆ తర్వాత సినిమాలతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్‌కు డేట్స్ ఇచ్చాడని, త్వరలో ఆ సెట్‌లో అడుగుపెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఓజీ షూటింగ్ కూడా బ్యాంకాక్‌లో జరగనుందట.
ఇప్పటికే సుజిత్ లోకేషన్ వేటలో ఉండగా.. అన్నీ ఓకే అయిన తర్వాత ఓజీ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ బర్త్ డే కూడా రానుంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ వేడులకు దూరంగా ఉండేందుకు పవన్ ఇలా విదేశాలకు వెళ్లినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి పవన్ ఫ్యామిలీతో సంతోషంగా గడిపేందుకు టైం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. బర్త్ డే ఇండియాలో ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు.