ఎన్టీఆర్ ను బాబాయ్ సెట్ చేస్తే, బాలయ్యను అబ్బాయ్ సెట్ చేశాడు
గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కా లెక్కలతో ప్లానింగ్ చేసుకున్నారు
గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కా లెక్కలతో ప్లానింగ్ చేసుకున్నారు. ఎలాగైనా సరే భారీ హిట్టు కొట్టాలని రికార్డులు బద్దలు కావాలని కమిట్మెంట్ తో రంగంలోకి దిగుతున్నారు. భారీ బడ్జెట్ తో మేకింగ్ అయిన ఈ సినిమా కచ్చితంగా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అవుతుందని మేకర్స్ కాలర్ ఎగరేస్తున్నారు. అందుకే సినిమా లేట్ అయినా సరే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేశారు నిర్మాత దిల్ రాజు.
ఇక ఈ సినిమా విషయంలో కచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉంటుందని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. కారణం దేవర సినిమా టైంలో ఎన్టీఆర్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడంతో.. కచ్చితంగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని భయపడ్డారు. అందుకే ఈ విషయంలో రామ్ చరణ్ చాలా అలర్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. నందమూరి ఫ్యాన్స్ ను దారిలోకి తెచ్చుకోవడానికి బాలయ్యను బుట్టలో వేసుకోవడానికి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు అటెండ్ అయ్యాడు. బాలయ్యతో రామ్ చరణ్ కు మంచి రాపో ఉంది. దీనికి సంబంధించిన కొన్ని రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను చూడటం ఖాయమని కాన్ఫిడెన్స్ మెగా ఫాన్స్ లో కూడా ఉంది.
ముఖ్యంగా కృష్ణ గుంటూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఇక లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా సెట్ చేసినట్టే కనబడుతోంది. ఏ ఈవెంట్ కి వెళ్ళినా సరే జూనియర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా పవన్ నోటి నుంచి వస్తుంది. అలాగే నిన్న కూడా పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్వాగతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. సినిమాను ట్రోల్ చేయాలనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
అయితే దీని వెనక మరో రీజన్ కూడా ఉంది. అన్ స్టాపబుల్ లో బాలకృష్ణ స్క్రీన్ పై కొంతమంది హీరోల ఫోటోలు చూపించి డైరెక్టర్ బాబి కొల్లిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ టైంలో ఎన్టీఆర్ ఫోటోని స్క్రీన్ పై చూపించలేదు. స్వయంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ను పక్కన పెట్టడంతో సీరియస్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటంతో ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టిన బయట వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు అంటూ.. పోస్టులు చేస్తున్నారు.